శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 ఫిబ్రవరి 2016 (11:53 IST)

అగ్రస్థానాన్ని నిలుపుకున్న టీమిండియా.. 139 యేళ్లలో ఏకైక కెప్టెన్ ధోనీ

ట్వంటీ-20ల్లో భారత క్రికెట్ జట్టు తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఆస్ట్రేలియా గడ్డపై ధోనీ సేనకు లభించిన మూడో వరుస విజయం. దీంతో 120 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. ఇక వరుసగా మూడు టీ20ల్లోనూ పరాజయం చవిచూసిన ఆసీస్ జట్టు 110 రేటింగ్ పాయింట్లతో ఏకంగా ఎనిమిదో స్థానానికి దిగజారిపోయింది. ఇక 118 రేటింగ్ పాయింట్లతో ఉన్న వెస్టిండీస్, శ్రీలంకలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 
 
మరోవైపు ఆదివారం లభించిన విజయంతో 139 ఏళ్ల రికార్డును కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బద్దలు కొట్టారు. గత 139 సంవత్సరాల్లో మూడు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన పర్యాటక జట్టు సారథిగా ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా.. విదేశీ కెప్టెన్లకు శ్మశానం అని పేరుబడిన ఆస్ట్రేలియా గడ్డపై వారినే చిత్తుచేసి సగర్వంగా నిలిచాడు.