బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2015 (12:13 IST)

దినేష్ మోంగియా ఫిక్సర్.. డబ్బుతో పాటు అందమైన అమ్మాయిలను కూడా..?

ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో ఫిక్సింగ్ బాగోతాన్ని న్యూజిలాండ్ మాజీ ఆటగాడు లూ విన్సెంట్ లండన్ కోర్టులో విచారణలో భాగంగా బయటపెట్టాడు. ఫిక్సింగ్ వ్యవహారంలో క్రిస్ కెయిన్స్‌ కోసం తనతో పాటు దినేష్ మోంగియా మ్యాచ్‌ల్ని ఫిక్సింగ్ చేసినట్లు విన్సెంట్ చెప్పాడు. తనను కెయిన్సే ఫిక్సింగ్‌లోకి దించాడని.. మ్యాచ్‌లు జరుగుతుండగానే ఓ ఇండియన్ ఫిక్సింగ్ ప్రతిపాదనలతో ముందుకొచ్చాడని.. డబ్బులతో పాటు అందమైన అమ్మాయిల్ని కూడా పంపుతానని ఆఫర్ ఇచ్చాడని విన్సెంట్ కుండబద్ధలు చేశాడు. 
 
ఈ విషయాన్ని కెయిన్స్‌కు చెప్పానని.. కెయిన్స్ సైతం తనను ప్రోత్సహించాడని చెప్పుకొచ్చాడు. అప్పట్లో మానసిక ఒత్తిడితో ఉన్న తాను వెంటనే ఫిక్సింగ్ గ్యాంగ్‌లో చేరిపోవాల్సి వచ్చిందని చెప్పాడు. మొత్తం నలుగురు సభ్యుల ఫిక్సింగ్ గ్యాంగ్‌లో దినేష్ మోంగియా, కివీస్ పేస్ బౌలర్ టఫీ సభ్యులని విన్సెంట్ స్పష్టం చేశాడు. కాగా, విన్సెంట్ ఆరోపణలను మోంగియా తీవ్రంగా ఖండించాడు. ఐసీఎల్ సమయంలో చంఢీగఢ్ లయన్స్‌కు ఆడానని, జట్టులో ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్లు ఏం చేశారో తనకు తెలియదని.. విన్సెంట్ చెప్పేవన్నీ అవాస్తవాలన్నాడు.