Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బీసీసీఐ నుంచే ఐసీసీకి 80 శాతం ఆదాయం.. బీ కేర్ ఫుల్: రవిశాస్త్రి వార్నింగ్

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (13:33 IST)

Widgets Magazine

బీసీసీఐ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల నుంచి లబ్ధిపొందాలనుకుంటున్న వారికి మాజీ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ రవిశాస్త్రి వార్నింగ్ ఇచ్చారు. బీసీసీఐ పట్ల ఐసీసీ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఐసీసీకి ఎక్కువ నిధులు బీసీసీఐ నుంచే వెళ్తున్నాయనే విషయాన్ని రవిశాస్త్రి గుర్తు చేశారు. అలాంటి బీసీసీఐకి పెద్ద మొత్తంలో షేర్ ఇచ్చేందుకు ఐసీసీ నిరాకరించడాన్ని రవిశాస్త్రి తప్పుపట్టారు.
 
అత్యధిక రెవెన్యూను అందించే బోర్డుగా, ఐసీసీ నుంచి తనకు రావాల్సిన ప్రతి పైసాను బీసీసీఐ డిమాండ్‌ చేయాలన్నాడు. ఐసీసీ టోర్నీలకు సంబంధించిన సుమారు 80 శాతం ఆదాయం భారత్ నుంచే వస్తుంది. అధిక వాటా అడుగుతున్నారు కాబట్టి భారత దౌర్జన్యం చేస్తుందని అంటున్నారా? అలాగైతే తన దృష్టిలో అంతకంటే చెత్త మరొకటి ఉండదని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. భారత నుంచి వచ్చే ఆదాయాన్ని మినహాయిస్తే.. ఎంత మిగులుతుందో చూడాలని ఉందని రవిశాస్త్రి అన్నాడు. 
 
బీసీసీఐలో అనిశ్చితి ఎక్కువ కాలం ఉండదు. అతిత్వరలో బీసీసీఐ మునుపటి ప్రభను సంతరించుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా బోర్డులను ఉద్దేశించే రవిశాస్త్రి ఇలాంటి హెచ్చరికలు చేసినట్టుగా తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

క్రికెట్ నిజమైన అంబాసిడర్ ధోనీ: అనిల్ కుంబ్లే ప్రశంసల వర్షం

టీమ్ ఇండియా కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ పదేళ్ల పయనం అసాధారణమైనదని భారత క్రికెట్ జట్టు ...

news

అటు కోహ్లీ, ఇటు అశ్విన్ ఇద్దరి కథా చూస్తామంటున్న ఆసీస్

మాటల యుద్ధం మొదలెట్టకుండా, మైండ్ గేమ్‌తో ప్రత్యర్థిని ఆటపట్టించకుండా నిజమైన ఆటను ...

news

ఆస్ట్రేలియాకు చేదు అనుభవం: కిట్ బ్యాగుల్ని మోసుకుని.. వాళ్లే వ్యానుల్లో లోడ్ చేసుకున్నారు..

భారత్‌లో మరో పర్యాటక జట్టైన ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురైంది. ముంబై ఎయిర్‌పోర్టులో ...

news

లిటిల్ట్ మాస్టర్‌తో లిటిల్ ఫ్యాన్.. ఆ తేదీని క్యాలెండర్‌లో మార్కు లేదా సేవ్ చేసుకోండి..

టీమిండియా స్టార్ ప్లేయర్ హర్భజన్ సింగ్ కుమార్తె హినయ హీర్‌తో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ...

Widgets Magazine