శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (19:18 IST)

ముక్కోణపు సిరీస్ నుంచి టీమిండియా అవుట్..!

ముక్కోణపు సిరీస్ నుంచి టీమిండియా ఇంటి దారి పట్టింది. టోర్నీలో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని టీమిండియాకు వరల్డ్ కప్ ముందు మంచి ఎదురుదెబ్బ తగిలింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇంగ్లండ్ తో జరిగిన కీలకమైన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా చతికిలపడింది. 
 
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 201 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఇంగ్లండ్‌కు నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ ఆదిలో కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఒక దశలో 90 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను జేమ్స్ టేలర్(82), బట్లర్(67 )లు ఆదుకున్నారు.
 
చివరికి ఒత్తిడిని జయించి టేలర్, బట్లర్ జట్టును గెలిపించారు. 190 పరుగుల వద్ద జేమ్స్ టేలర్, 193 పరుగుల వద్ద బట్లర్‌లు పెవిలియన్ కు చేరినా.. అప్పటికే ఇంగ్లండ్ విజయం ఖాయమైంది. 
 
మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాతో తుదిపోరుకు సన్నద్ధమైంది. మిండియా బౌలర్లలో స్టువర్ట్ బిన్నీకి మూడు వికెట్లు లభించగా, మోహిత్ శర్మకు రెండో వికెట్లు దక్కాయి.