శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జులై 2016 (13:04 IST)

పాకిస్థాన్‌పై జో రూట్ డబుల్ సెంచరీ.. 52 ఏళ్లలో తొలి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. స్వదేశీ గడ్డపై పర్యాటక పాకిస్థాన్ జట్టుపై డబుల్ సెంచరీ సాధించాడు. క్రికెట్‌కు పుట్టినిల్లుగా ఉన్న ఇంగ్లండ్ జట్టులో ఆ దేశ చరిత్రలో 52 యేళ్ళ తర్వాత డబు

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. స్వదేశీ గడ్డపై పర్యాటక పాకిస్థాన్ జట్టుపై డబుల్ సెంచరీ సాధించాడు. క్రికెట్‌కు పుట్టినిల్లుగా ఉన్న ఇంగ్లండ్ జట్టులో ఆ దేశ చరిత్రలో 52 యేళ్ళ తర్వాత డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు పుటలకెక్కాడు.
 
ప్రస్తుతం ఇంగ్లండ్ - పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య రెండో జట్టు మాంచెస్టర్ వేదికగా జరుగుతోంది. ఇందులో బ్యాట్స్‌మన్ జో రూట్ 406 బంతుల్లో 27 ఫోర్ల సాయంతో 254 పరుగులు చేశాడు. ఇది అతని కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ. ఈ అరుదైన ఫీట్ సాధించిన రెండో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్. 52 ఏళ్ల తర్వాత ఓ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ స్వదేశంలో పాకిస్థాన్‌పై డబుల్ సెంచరీ చేశాడు.
 
కుక్ సెంచరీకి రూట్ విధ్వంసం తోడవ్వడంతో పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 152.2 ఓవర్లలో 8 వికెట్లకు 589 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్వదేశంలో పాక్‌పై డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 2014లో లార్డ్స్ టెస్టులో శ్రీలంకపై (200) తొలి డబుల్ సెంచరీ చేశాడు. 
 
రెండు లేదా అంతకన్నా ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన ఇంగ్లండ్ మూడో ఆటగాడు రూట్. గతంలో అలిస్టర్ కుక్ మూడు డబుల్ సెంచరీలు చేయగా, కెవిన్ పీటర్సన్ రెండు ద్విశతకాలు చేశాడు. పాకిస్థాన్‌పై డబుల్ సెంచరీ నమోదు చేసిన నాలుగో ఆటగాడు జో రూట్. ఇప్పటివరకూ డెనిస్ కాంప్టన్ (278), కుక్ (263), టెడ్ డెక్టర్స్ (205)లు మాత్రమే ఈ ఘనతను సాధించారు.