శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2016 (12:50 IST)

డబ్బులివ్వకుండా మోసం చేసిందని ధోనీ భార్యపై 420కేసు!

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షిపై సెక్షన్‌ 420 కింద కేసు నమోదైంది. సాక్షి, అరుణ్‌ పాండే, శుభావతి పాండే, ప్రతిమ పాండేలు రితి ఎమ్‌ఎస్‌డీ అల్మోడే ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే స్పోర్ట్స్‌ మేనేజ్‌

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షిపై సెక్షన్‌ 420 కింద కేసు నమోదైంది. సాక్షి, అరుణ్‌ పాండే, శుభావతి పాండే, ప్రతిమ పాండేలు రితి ఎమ్‌ఎస్‌డీ అల్మోడే ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి డైరెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ ఈ కంపెనీలో సమాన షేర్లు ఉన్నాయి. వీరితోపాటు డెన్నిస్ అరోరా అనే వ్యక్తికి కూడా ఈ ఫిట్‌నెస్ సెంటర్‌లో 39 శాతం వాటా ఉండేది. వాటాల విక్రయం వ్యవహారంలో డబ్బు చెల్లించకుండా తనను మోసం చేశారని డెన్నిస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
 
డెన్నిస్ కంపెనీలోని తన వాటాను డైరెక్టర్లకు అమ్మేశాడు. ఇందులో భాగంగా మార్చి చివరి నాటికి అరోరాకి రూ.11 కోట్లు రావాల్సిన నేపథ్యంలో ఇప్పటి వరకు రూ. 2.25 కోట్లు మాత్రమే అతడికి ముట్టాయి. సాక్షితో పాటు మిగతా డైరెక్టర్లు డబ్బు ఇవ్వలేదని అతను అందరిపై కేసు వేశాడు. సాక్షి మాత్రం ఈ విషయమై స్పందించలేదు. దీంతో అతడు సాక్షి ధోనితోపాటు మిగతా ముగ్గురు డైరెక్టర్లపై గుర్గావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కంపెనీ నుంచి కొన్నేళ్ల కిందటే సాక్షి వైదొలిగిందని, ఆమెపై కేసు నమోదు చేసే అవకాశం లేదని అరుణ్ పాండే వాదిస్తున్నారు. మరి ఈ కేసు విషయమై ధోనీ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.