గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2015 (08:36 IST)

కోహ్లిలో ఆ కసి ఉంది... గంగూలీ ప్రశంస

భారత టెస్ట్‌ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లిలో గెలవాలన్న కసి, తపన, అందుకు తగ్గ దూకుడు ఉన్నాయని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. భారత టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై మాజీ కెప్టెన్‌ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆటలో గెలుపోటములు సహజమని, కెప్టెన్‌గా అతడు కొన్నిసార్లు గెలవొచ్చు, కొన్నిసార్లు ఓడిపోవచ్చు. అది లెక్క లేదని గెలవాలనే పట్టుదలతో అతను ఆడే విధానమే ముచ్చటేస్తుందని చెప్పాడు. 
 
 క్రికెట్ ఆటపై అంత మోజుతో అతడు జట్టును నడిపిస్తుండడం విశేషమని, కోహ్లి కెప్టెన్‌గా తన కన్నా మెరుగ్గా రాణించాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా పర్యటనలు అతడి నాయకత్వ సత్తాను పరీక్షిస్తాయని అభిప్రాయపడ్డారు.