Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యువీ.. భార్య నుంచి బౌన్సర్లు తప్పవ్.. చెస్ట్‌గార్డుల్లేవ్.. బీకేర్ ఫుల్.. నా టిప్స్ పాటించు: గంభీర్

గురువారం, 1 డిశెంబరు 2016 (14:17 IST)

Widgets Magazine

టీమిండియా స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్, తన స్నేహితురాలు, నటి హాజల్ కీచ్‌ను బుధవారం అతను పెళ్లాడాడు. చండీగఢ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఫతేగఢ్ సాహిబ్ గ్రామం వద్ద ఉన్న ధార్మిక కేంద్రం ‘బాబా రాందేవ్ సింగ్ డేరా’లో వివాహ వేడుక జరిగింది. పంజాబీ సంప్రదాయం ‘ఆనంద్ కరాజ్’ పద్ధతిలో యువీ వివాహం జరిగింది.

అనంతరం రాందేవ్ సింగ్ కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో మైదానంలో ఎప్పుడూ సీరియస్‌గా ఉండే.. గంభీర్‌ యువీ పెళ్ళిపై ఫన్నీ కామెంట్స్ చేశాడు. యువరాజ్‌ సింగ్‌ను ఆటపట్టిస్తూ గంభీర్‌ చేసిన సరదా ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లైన సందర్భంగా యువీకి పలు జాగ్రత్తలు చెబుతూ గంభీర్‌ ట్వీట్‌ చేశాడు. 
 
‘పెళ్లిలో మంచి షేర్వాణీ ధరించిన యువరాజ్‌.. ఎవరికీ తెలియకుండా లోపల బాల్స్ ఛాతికి తగలకుండా బ్యాట్స్‌మెన్లు ధరించే చెస్ట్‌గార్డ్‌ కూడా ధరించే ఉంటాడు. అయితే పెళ్లి తర్వాత భార్య నుంచి ఎదురయ్యే బౌన్సర్లను అడ్డుకునేందుకు ఇప్పటివరకు ఎవరూ చెస్ట్‌గార్డ్‌లను తయారుచేయలేదని యువీ తెలుసుకోవాలని కామెంట్స్ చేశాడు.

పెళ్లయ్యాక చాలా కష్టాలు తప్పవ్. కొత్త పెళ్లి కొడుక్కి తాను సహాయం చేస్తానని, భార్య నుంచి బౌన్సర్లను ఎదుర్కొనేందుకు తన వద్ద కొన్ని టిప్స్ ఉన్నాయని గంభీర్ వ్యాఖ్యానించాడు. యువీని ఈసారి కలిసినపుడు ఆ టిప్స్ ఏంటో చెప్తాను. అప్పటివరకు మాత్రం యువీకి బెస్ట్ విషెస్ అంటూ గంభీర్ ట్వీట్ చేశాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ఫిట్నెస్ రహస్యమేంటో తెలుసా?

భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టెస్ట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ...

news

హోటల్ రూమ్‌లకు అమ్మాయిల్ని తీసుకెళ్లిన బంగ్లాదేశ్ క్రికెటర్లు.. భారీ ఫైన్

బంగ్లాదేశ్ క్రికెటర్లు క్రమశిక్షణను ఉల్లంఘించారు. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ ...

news

కోహ్లీ సేన అదుర్స్ : మొహాలీ టెస్టులో టీమిండియా గెలుపు.. తీవ్ర ప్రస్టేషన్‌లో ఉన్నానన్న కుక్..

మొహాలీ వేదికగా మూడో టెస్టులో భారత్ విజయాన్ని నమోదు చేసుకుంది. తద్వారా కోహ్లీ సేనకు ...

news

పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయే స్థితికి చేరుకుంటే.. కోహ్లీకి ధోనీ బాసటగా నిలిచాడు..

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ అంతా విరాట్ కోహ్లీ పేరునే చెప్తోంది. అయితే అందరి నోట 'శభాష్‌ ...