శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 మే 2015 (11:29 IST)

క్రిస్ గేల్ పెళ్ళికి పిలిచాడోచ్.. ఎగిరి గంతేసిన సర్ఫరాజ్ ఖాన్!

సర్ఫరాజ్ ఖాన్ పేరు ఐపీఎల్ 8వ సీజన్లో మారుమ్రోగింది. రెండునెలల క్రితం వరకు ఇతనంటే ఎవరో ఎవరికీ తెలియదు. అయితే ఐపీఎల్ 8వ సీజన్ పుణ్యంతో 15 ఏళ్ల కుర్ర క్రికెటర్.. భారీ షాట్లతో దిగ్గజ క్రికెటర్లే ఫిదా అయ్యారు. ఐపీఎల్ ముగిసిన తరువాత కూడా సర్ఫరాజ్ ఇంకా ఆ లోకం నుంచి తిరిగిరాలేదు. క్రిస్ గేల్, ఏబీ డెవిలియర్స్, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడంపై తన అనుభవాలను మిత్రులతో పంచుకుంటున్నాడు. 
 
వెస్టిండీస్‌లో వచ్చే నెలలో జరిగే తన వివాహ వేడుకకు తప్పకుండా రావాలని క్రిస్ గేల్ ఆహ్వానించినట్టు చెబుతున్నాడు. వేలాది మంది "సర్ఫరాజ్... సర్ఫరాజ్" అని అంటుంటే, ఆ అరుపులు తనకు మళ్లీ మళ్లీ వినాలని ఉందని అన్నాడు. డెవిలియర్స్ తనకు ఎన్నో మంచి సూచనలు ఇచ్చాడని చెబుతున్నాడు. ప్రస్తుతం 80 కిలోల బరువున్న తాను వచ్చే సంవత్సరం వ్యవధిలో 6 కిలోల బరువు తగ్గాలనుకుంటున్నట్లు తెలిపాడు.