శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (15:57 IST)

గురిందర్ సంధూ 7 వికెట్లు: భారత్-ఏపై ఆస్ట్రేలియా-ఎ గెలుపు!

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన రెండో అనధికార క్రికెట్ టెస్టులో ఆస్ట్రేలియా-ఎ జట్టు పది వికెట్ల తేడాతో ఇండియా-1 జట్టుపై విజయం సాధించింది. ఆసీస్ విజయంలో మనవాడి పాత్ర ఉందంటే నమ్మితీరాల్సిందే. భారత సంతతి బౌలరైన గురిందర్ సంధూ ఇండియా-ఎ జట్టును రెండు ఇన్నింగ్స్‌లలోనూ దెబ్బతీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 25 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన ఈ యువ పేసర్, రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులకు 4 వికెట్లతో సత్తా చాటాడు. 
 
టెయిలెండర్లను క్రీజులో కుదురుకోనీయకుండా పెవిలియన్ చేర్చాడు. ఓవరాల్‌గా ఈ టెస్టులో 7 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మెక్ గ్రాత్, బ్రెట్ లీ వంటి పేస్ దిగ్గజాలు సంధూ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఆసీస్ జాతీయ జట్టుకు ఆశాకిరణమని పేర్కొంటున్నారు. గురిందర్ సంధూ ఆటతీరుతో భవిష్యత్తులో ఆస్ట్రేలియా జట్టుకు విజయాలు తప్పవని క్రీడా పండితులు జోస్యం చెబుతున్నారు.
 
ఈ మ్యాచ్‌లో, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (49) అర్థ సెంచరీని మిస్ చేసుకున్నా రు. ఓజా (30) కూడా స్వల్ప స్కోరుకే అవుట్ కావడంతో కంగారూల చేతిలో భారత ఏ జట్టు పరాజయం మూటగట్టుకుమ్విజయం సాధించింది.