మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (18:05 IST)

అక్టోబర్ 29న హర్భజన్ సింగ్-గీతా బాస్రాల పెళ్లి భాజాలు!

టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నాడు. బాలీవుడ్ నటి గీతా బాస్రాను పెళ్లాడేందుకు భజ్జీ కుటుంబీకులు ముహూర్తం ఖరారు చేసేశారు. వీరిద్దరూ వివాహ వేడుక అక్టోబర్ 29వ తేదీన పంజాబ్‌లో జరుగనుందని తెలిసింది. ఐదురోజుల పాటు జరిగే ఈ వివాహ వేడుకలో పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లు పాల్గొంటారని సమాచారం. 
 
ఐదు రోజుల పెళ్లి కార్యక్రమం ముగిశాక నవంబర్ 1న ఢిల్లీలో రిసెప్షన్‌కు హర్భజన్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. సౌతాఫ్రికా సిరీస్‌లో ఉన్న హర్భజన్‌కు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 5 వరకు మ్యాచ్‌ల నుంచి బ్రేక్ లభిస్తోంది. ఈ బ్రేక్‌లోనే పెళ్లి చేసేసుకోవాలని భావించిన భజ్జీ.. పెద్దలతో ముహూర్తం ఖాయం చేసేశాడని సన్నిహితులు అంటున్నారు.