గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2015 (13:43 IST)

అక్టోబర్‌లో పెళ్లికొడుకుకానున్న హర్భజన్.. గర్ల్‌ఫ్రెండ్ నటి గీతా బస్రాతోనే...

భారత క్రికెట్ జట్టులో ఉన్న మోస్ట్ బ్యాచిలర్స్‌లలో స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఒకరు. ఈ బ్యాచిలర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన తన గర్ల్‌ఫ్రెండ్ గీతా బస్రాను వివాహం చేసుకోనున్నాడు. ఈ పెళ్లి వేడుక పంజాబ్‌లోని జలంధర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫగ్వారా అనే ప్రాంతంలో అక్టోబర్ 29వ తేదీన జరగనుందని హిందూస్తాన్ టైమ్స్ పత్రిక ప్రచురించిన కథనంలో వెల్లడించింది.
 
 
దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్‌లకు భజ్జీ సెలక్ట్ అయితే పెళ్లి తేదీ మారే అవకాశం ఉందని కూడా ఈ కథనంలో పేర్కొంది. నిజానికి బాలీవుడ్ నటి అయిన గీతా బస్రాతో గత కొన్ని సంవత్సరాల నుంచి హర్భజన్ ప్రేమాయణం నడుస్తోంది. అయితే, ఈ విషయాన్ని భజ్జీ ఎపుడు కూడా బహిరంగంగా ఎక్కడాకూడా చెప్పలేదు. కానీ, గీతా తాజా చిత్రం 'సెకండ్ హ్యాండ్ హజ్బెండ్'లో భజ్జీ ప్రత్యేకంగా కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి పెళ్లి వార్తలు గుప్పుమనడం గమనార్హం.