Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోహ్లీకి వరద నిధుల నుంచి రూ.47.19 లక్షలిచ్చారా? హరీష్ రావత్‌కు కొత్త తలనొప్పి?

శనివారం, 25 ఫిబ్రవరి 2017 (17:20 IST)

Widgets Magazine
Kohli

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉత్తరాఖండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఉత్తరాఖండ్ సర్కారు కోహ్లీ భారీ మొత్తాన్ని అందించింది. అయితే కోహ్లీకి ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ అందించిన రూ.47లక్షల పైచిలుకు వరద నిధుల నుంచి కావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
 
అసెంబ్లీ ఫలితాలు మార్చి 11వ తేదీన విడుదలవుతున్న తరుణంలో బీజేపీ కార్యకర్త ఒకరు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. కోహ్లీకి ఉత్తరాఖండ్ సర్కారు 2015జూన్‌లో వరద నిధుల నుంచి అక్షరాలా రూ.47.19 లక్షలు చెల్లించింది. 2013 కేదార్‌నాథ్‌ను వరదలు ముంచెత్తిన తరుణంలో బాధితుల పునరావాసం కోసం కేటాయించిన నిధుల నుంచి కోహ్లీ భారీ మొత్తం ఇవ్వడం సబబు కాదని.. విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే దీనిపై సీఎం హరీష్ రావత్ మీడియా సలహాదారు సురేంద్ర కుమార్ వివరణ ఇచ్చారు. 
 
రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో టూరిజం శాఖ కీలమన్నారు. అందుకే ఆ శాఖను ప్రమోట్ చేసేందుకు ఓ ప్రముఖ వ్యక్తిని ఎంచుకోవడంలో తప్పులేదన్నారు. చట్టప్రకారమే అన్నీ చేశామని తెలిపారు. దీనిపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అనవసరంగా  బీజేపీ ఓడిపోతామనే భయంతో ఇలాంటి ఆరోపణలు చేస్తుందని దుయ్యబట్టారు.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

చెత్తచెత్తగా చిత్తుచిత్తుగా ఓడిన టీమ్ ఇండియా... 333 పరుగుల తేడాతో ఓడించిన ఆసీస్....

టీమ్ ఇండియా సొంతగడ్డపై వరుస టెస్ట్ సిరీస్‌లకు బ్రేక్ కొడుతూ ఆసీస్ 333 భారీ పరుగుల ...

news

పూణే టెస్టు.. స్మిత్ సెంచరీ.. భారత్ విజయలక్ష్యం 441 పరుగులు

పూణే టెస్టులో భారత్‌ బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు ధీటుగా రాణించలేకపోయారు. ఫలితంగా భారత్‌ ...

news

పూణే టెస్టు.. కోహ్లి సేనకు తొలి పరాభవం... 105 పరగులకే ఆలౌట్... 11 పరుగులు 7 వికెట్లు

ఆస్ట్రేలియాతో పూణేలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్లు ...

news

టాయ్‌లెట్‌కు వెళ్లాల్సి వచ్చిందనుకో.. వెళ్లాల్సిందే కదా: ఆసీస్ ఓపెనర్ బాధ

ఆటగాళ్లు ఔటయితే దిగాలుగా వెవిలియన్ వైపుకు దారి తీయడం సహజంగానే అందరికీ తెలిసిన విషయమే ...

Widgets Magazine