శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (14:20 IST)

ఆప్ఘనిస్థాన్ చారిత్రాత్మక విజయం: స్కాట్లాండ్‌పై వికెట్ తేడాతో గెలుపు!

ఆప్ఘనిస్థాన్ వరల్డ్ కప్‌లో చారిత్రత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. ఆప్ఘనిస్థాన్-స్కాట్లాండ్‌ల మధ్య డునెడిన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్ధాన్ వికెట్ తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 210 పరుగలకు ఆలౌటైంది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్ధాన్ తడబడినా చివర్లో ధాటిగా ఆడి మూడు బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
 
ఆదిలోనే కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆఫ్ఘనిస్ధాన్‌కు షముల్లాఫ్ షెన్వారీ ఆదుకున్నాడు. షెన్వారీ (96; 147 బంతుల్లో 7 ఫోర్లు, 5సిక్సులు) ఆకట్టుకుని ఆఫ్ఘన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్లు మాజిద్ హక్, అల్సడీర్ ఈవెన్స్‌ల 62 పరుగుల భాగస్వామ్యం విజయంలో కీలక పాత్ర పోషించింది. 
 
ఆప్ఘనిస్ధాన్ ఓపెనర్‌ అహ్మది అర్ధ సెంచరీ సాధించి 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బారింగ్టన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. హమీద్ హస్సాన్ (15), షాపూర్ జర్దాన్(12) లు చివరి వరకూ క్రీజ్ లో ఉండి విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. 
 
స్కాట్లాండ్ బౌలర్లలో బెర్రింగ్టన్ నాలుగు, డేవే, ఇవాన్స్‌లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఇక స్కాట్లాండ్ ఆటగాళ్లలో కోట్జర్(25), మచాన్(31), మామ్ సెన్(23), బెర్రింగ్టన్(25), మస్జిద్ ఖాన్(31), ఇవాన్స్(28) పరుగులు చేశారు