బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 27 జులై 2015 (10:14 IST)

దావూద్‌తో సంబంధాలుండివుంటే విదేశాల్లో ఉండేవాడిని : శ్రీశాంత్

తనకు అండర్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉండివున్నట్టయితే తాను విదేశాల్లో ఉండేవాడినని కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పాటియాలా కోర్టు శ్రీశాంత్‌ సహా మొత్తం 16 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేసిన విషయంతెల్సిందే. 
 
కోర్టు తీర్పు తర్వాత శ్రీశాంత్ ఆదివారం తొలిసారి తన నివాసానికి చేరుకున్నారు. శ్రీశాంత్‌కు.. కొచ్చి విమానాశ్రయంలో అభిమానులు, బంధువులు, స్నేహితులు భావోద్వేగంతో స్వాగతం పలికారు. కష్టకాలంలో కేరళ ప్రజలు తనకు అండగా నిలవడం అదృష్టమని శ్రీ పేర్కొన్నాడు.
 
ఈ సందర్భంగా శ్రీశాంత్ స్పందిస్తూ మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలు ఉంటే తాను క్రికెటర్‌నే అయి ఉండేవాడిని కాదనీ, అసలు తాను భారత్‌లోనే ఉండేవాడిని కాదని, దుబాయ్‌ లేదా ఇతర ప్రాంతాల్లో జీవించే వాడినని చెప్పాడు. 
 
స్పాట్ ఫిక్సింగ్ కేసులో తనకెలాంటి సంబంధం లేదని తొలి రోజు నుంచి నేను చెపుతూ వచ్చాను. నా వ్యక్తిత్వం, నిబద్ధతపైనే ప్రశ్నలు వచ్చాయి. నాపై మోపిన అభియోగాలన్నీ ఇపుడు తొలిగాయి. ఇప్పుడు ఆనందంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇక తాను కెరీర్‌ ఆరంభించిన ఎడపల్లి స్కూల్లోనే శ్రీశాంత్‌ మళ్లీ నెట్‌ ప్రాక్టీస్‌‌ను ఆదివారమే మొదలెట్టడం గమనార్హం.