గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (18:11 IST)

అంతర్జాతీయ వన్డే కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఇయాన్ బెల్

ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్ ఇయాన్ బెల్ అంతర్జాతీయ వన్డే కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. కేవలం టెస్ట్ కెరీర్‌పై మరింత దృష్టిసారించేందుకు వీలుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు గుడ్‌బై చెపుతున్నట్టు ప్రకటించారు. 
 
వాస్తవానికి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనున్నాడంటూ ఇయాన్ బెల్ గురించి ఇంగ్లండ్ మీడియా అనేక కథనాలు ప్రచురించింది. అయితే వన్డేల నుంచి మాత్రమే తప్పుకుంటున్నట్టు బెల్ ప్రకటించడం విశేషం. యాషెస్ ముగిసిన అనంతరం కోచ్ ట్రెవర్ బెలిస్, కెప్టెన్ అలిస్టర్ కుక్ తో చర్చించిన అనంతరం తానీ నిర్ణయం తీసుకున్నట్టు బెల్ స్పష్టం చేశాడు. 
 
దీనిపై బెల్ స్పందిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునేందుకు ఇది సరైన సమయం అని భావించడం లేదని, అందుకే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించలేదని వెల్లడించాడు. కాగా, ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన ఇయాన్ బెల్ 161 వన్డేలాడి 5,416 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 34 అర్థ సెంచరీలు ఉన్నాయి.