శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 మే 2017 (15:45 IST)

ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్థాన్‌తో కోహ్లీ సేనకు కష్టాలు తప్పవా?

ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లండ్‌పై కాలుమోపిన విరాట్ కోహ్లీ సేన బలపరీక్షకు సిద్ధంగా ఉంది. విదేశీ గడ్డపై సత్తా చాటేందుకు కోహ్లీ సేన పలు సవాళ్లను ఎదుర్కోక తప్పదు. ఛాంపియన్స్ ట్రోఫీ జూన్ ఒకటో తేదీ నుం

ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లండ్‌పై కాలుమోపిన విరాట్ కోహ్లీ సేన బలపరీక్షకు సిద్ధంగా ఉంది. విదేశీ గడ్డపై సత్తా చాటేందుకు కోహ్లీ సేన పలు సవాళ్లను ఎదుర్కోక తప్పదు. ఛాంపియన్స్ ట్రోఫీ జూన్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో జూన్ 4వ తేదీన దాయాదీ దేశాల మధ్య పోరు ఉంటుంది. ముంబై పేలుళ్ల అనంతరం ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో ఆడిన భారత్.. ఆపై ఛాంపియన్స్ ట్రోఫీలోనే బరిలోకి దిగేందుకు సంసిద్ధమవుతోంది. పాకిస్థాన్‌పై గెలిచేందుకు భారత్ సాయశక్తులా ప్రయత్నిస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
 
మరోవైపు.. ఐసీసీ నిర్వహించే వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఇంతవరకూ ఓడిపోలేదు. ఇప్పటి వరకూ వన్డే వరల్డ్ కప్‌లలో 6-0తో, ట్వంటీ 20 వరల్డ్ కప్‌లో 5-0తో పాకిస్థాన్‌పై టీమిండియా పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం భారత్‌పై పాకిస్థాన్ మెరుగైన రికార్డు కలిగివుంది. ఇప్పటిదాకా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు మూడుసార్లు తలపడగా, పాకిస్థాన్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 2013లో ధోనీ నాయకత్వంలో ఆడిన టీమిండియా.. పాకిస్థాన్‌పై విజయం సాధించింది. తద్వారా దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై పాకిస్థాన్ 2-1తో మెరుగైన రికార్డుని కలిగి ఉంది.