శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 27 జూన్ 2015 (12:27 IST)

వన్డేల్లో బ్యాటింగ్ పవర్ ప్లే నిబంధన తొలగింపు : ఐసీసీ కీలక నిర్ణయం

అంతర్జాతీయ క్రికెట్‌లో పరిమిత 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌లలో ఇప్పటి వరకు అమలు చేస్తూ వచ్చిన పవర్ ప్లే బ్యాటింగ్ నిబంధనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలగిస్తూ కీలకనిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బార్బోడాస్‌ వేదికగా జరిగిన ఐసీసీ వార్షికస్థాయి సమావేశంలో బ్యాటింగ్ పవర్ ప్లేను తొలగించాలన్న నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ వెల్లడించారు. 
 
కాగా, ఇప్పటివరకు తొలి పది ఓవర్లతోపాటు చివరి ఐదు ఓవర్లలో మరో పవర్ ప్లే తీసుకునే వెసులుబాటు బ్యాట్స్‌మెన్‌కు ఉండేది. ఇది బౌలర్లకు తలనొప్పిగా మారింది. అందుకే ఈ నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. 
 
అంతేకాకుండా, గతంలో చివరి పది ఓవర్లలో నలుగురు ఫీల్డర్లకు మాత్రమే వలయం అవతల ఫీల్డింగ్ చేసే అవకాశముండేది. ఇప్పుడు వలయం అవతల ఐదుగురు ఫీల్డింగ్ చేసేందుకు అవకాశం కల్పించామని వివరించారు. అలాగే ఫ్రీ హిట్ నింధనల్లో కూడా మార్పు చేసింది.