గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 మే 2016 (19:17 IST)

భారత్-పాక్ క్రికెట్ సిరీస్‌పై అబ్బాస్ మాట.. ఐపీఎల్‌లో పాక్ క్రికెటర్లు.. బీసీసీఐ గ్రీన్ సిగ్నల్?!

ముంబై దాడుల అనంతరం ఇండో-పాక్ క్రికెట్ సిరీస్‌‌‌కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఐపీఎల్ తొమ్మిదో సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చూసేందుకు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఆహ్వానం మేరకు ఐసీసీ ప్రెసిడెంట్, పాక్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ భారత్ రానున్నారు.

ఈ రాకను పురస్కరించుకుని భారత్-పాక్ క్రికెట్ సిరీస్‌ కోసం ఆయన పావులు కదుపనున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఆదివారం జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించనున్న జహీర్ అబ్బాస్ భారత్-పాకిస్థాన్ క్రికెట్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటానని కరాచీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. 
 
‘బీసీసీఐ నుంచి ఆహ్వానాన్ని అందుకున్నానని, భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్‌కు సంబంధించిన చర్చలకు ఇది మంచి వేదిక అవుతుందని భావిస్తున్నట్లు అబ్బాస్ వెల్లడించారు. ఇంకా పాకిస్థాన్ ఆటగాళ్లని ఐపీఎల్‌లోకి అనుమతించాలని కూడా బీసీసీఐని కోరనున్నట్లు తెలిపారు.

కాగా 2008లో ఆరంభమైన ఐపీఎల్‌ తొలి సీజన్‌లో పాక్ క్రికెటర్లు పాల్గొన్నారు. అయితే ముంబై దాడుల అనంతరం పాకిస్థాన్‌తో క్రికెట్ సిరీస్‌తో పాటు ఐపీఎల్‌లో పాక్ క్రికెటర్లకు అనుమతిని బీసీసీఐ నిరాకరించిన సంగతి తెలిసిందే.