Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆస్ట్రేలియా రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ

శుక్రవారం, 1 డిశెంబరు 2017 (09:32 IST)

Widgets Magazine
team india

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సరికొత్త రికార్డుపై కన్నేశాడు. అదీకూడా క్రికెట్ ప్రపంచంలో అత్యంత పటిష్ట జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును సమం చేయాలని భావిస్తున్నాడు. 
 
ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోహ్లీ సేన ఇప్పటికే 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో డిసెంబరు 2 నుంచి భారత్‌-శ్రీలంక మధ్య చివరి టెస్టు ప్రారంభంకానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆసీస్ రికార్డును సమం చేయాలని భావిస్తోంది. 
 
ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క ఆస్ట్రేలియా మాత్రమే వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్‌ల్లో విజయం సాధించిన ఏకైక జట్టుగా ఉంది. 2005-2008 మధ్య ఆస్ట్రేలియా వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్‌ల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే టెస్టులో కోహ్లీ సేన విజయం సాధిస్తే ఆస్ట్రేలియా రికార్డును సమం చేసినట్టు అవుతుంది. 
 
వ్యక్తిగతంగా కోహ్లీ కూడా మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. టెస్టు క్రికెట్లో కోహ్లీ 5వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి కేవలం 25 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ టెస్టులో ఆ పరుగులు పూర్తి చేస్తే భారత్‌ తరఫున టెస్టు క్రికెట్లో 5వేల పరుగుల క్లబ్‌లో చేరిన 11వ ఆటగాడు అవుతాడు. ఇప్పటివరకు కోహ్లీ 62 టెస్టుల్లో 104 ఇన్నింగ్స్‌ల ద్వారా 4,975 పరుగులు సాధించాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

బీసీసీఐకి రూ.52కోట్ల భారీ జరిమానా.. సచిన్ జెర్సీ 10కు వీడ్కోలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికట్ ప్రసార హక్కుల కేటాయింపుల విషయంలో బీసీసీఐకి భారీ జరిమానా ...

news

బీసీసీఐకు షాకిచ్చిన కాంపిటిషన్ కమిషన్.. ఎందుకు?

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాంపిటిషన్ కమిషన్ షాకిచ్చింది. ఐపీఎల్ మీడియా ...

news

భారత బౌలర్లధాటికి ఉక్కిరిబిక్కిరయ్యాం : లంక కెప్టెన్

నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు చిత్తుగా ఓడింది. ...

news

విరాట్ కోహ్లీకి రెస్ట్ : టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో శ్రీలంకతో ...

Widgets Magazine