శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2016 (18:03 IST)

ఇండోర్ టెస్ట్ : విరాట్ కోహ్లీ శతకం... భారత్ ఫస్ట్ డే స్కోరు 267/3

పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో శనివారం నుంచి ఇండోర్ వేదికగా ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో భా

పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో శనివారం నుంచి ఇండోర్ వేదికగా ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. మొత్తం 191 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ... 10 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. స్వదేశంలో 17 ఇన్నింగ్స్‌ల తర్వాత కోహ్లీ సెంచరీ చేయడం గమనార్హం. 
 
కాగా, అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్(10)ను త్వరగా కోల్పోయింది. రెండేళ్ల తర్వాత జట్టులోకొచ్చిన గౌతం గంభీర్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో గంభీర్ (29, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)ను కివీస్ బౌలర్ బౌల్ట్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. పుజారా(41) మరోసారి రాణించాడు. 
 
అయితే స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయి 100 పరుగుల వద్ద మూడో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. 37వ ఓవర్ నుంచి తొలి రోజు ఆట నిలిపివేసే వరకూ రహానే, కోహ్లీలు కివీస్ బౌలర్లకు మరో అవకాశం ఇవ్వలేదు. వీరి అజేయ భాగస్వామ్యం (167)తో తొలిరోజు భారత్ పైచేయి సాధించి... తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో పటేల్, బౌల్ట్, శాంట్నర్ తలో వికెట్ తీశారు.