శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2016 (09:42 IST)

నేటి నుంటి భారత్ ప్రతిష్టాత్మక 500వ టెస్టు... సన్నద్ధమైన న్యూజిలాండ్

భారత క్రికెట్ జట్టు అత్యంత ప్రతిష్టాత్మకమైన 500వ టెస్టును గురువారం ఆడనుంది. పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో ఈ మ్యాచ్ ఆడుతుంది. టెస్టు క్రికెట్‌లో ప్రవేశించే నాటికి టీమిండియా పసికూన. ఇంగ్లండ్, వెస్టిండీస్,

భారత క్రికెట్ జట్టు అత్యంత ప్రతిష్టాత్మకమైన 500వ టెస్టును గురువారం ఆడనుంది. పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో ఈ మ్యాచ్ ఆడుతుంది. టెస్టు క్రికెట్‌లో ప్రవేశించే నాటికి టీమిండియా పసికూన. ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా లాంటి జట్లతో తలపడడం అంటే అప్పట్లో సవాలే. సరైన ప్యాడ్లు, హెల్మెట్ సౌకర్యాలు కూడా లేని రోజుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం సవాల్‌తో కూడుకున్నది.
 
అలాంటి ఆటను ప్రతి ఒక్కరూ ఆడుకునే ఆటగా తీర్చిదిద్దిన ఘనత సీకే నాయుడు, గవాస్కర్, కపిల్ దేవ్, అజహరుద్దీన్, గంగూలీ, సచిన్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, మహేంద్ర సింగ్ ధోనీ వంటివారికే చెల్లింది. దిగ్గజాల ఆటతీరుతో భారత క్రికెట్ జట్టు సమున్నత శిఖరాలు అధిరోహించింది. వన్డే, టీ20 వరల్డ్ కప్‌లు సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ ప్రాతినిధ్యం వహించిన ప్రతి టోర్నీలోను జయకేతనం ఎగురవేసింది. దీంతో భారత్‌‍లో క్రికెట్ అంటే ఆటకాదు మతం అన్నంతగా ఆదరణ పొందింది. 
 
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు గురువారం అత్యంత ప్రతిష్టాత్మకమైన 500వ టెస్టును న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఈ సందర్భంగా టీమిండియాకు విశిష్ట సేవలందించిన మాజీ కెప్టెన్లందరినీ బీసీసీఐ సత్కరించనుంది. ఈ సందర్భంగా అతిథులకు 500 వంటకాలతో కూడిన విందు ఇవ్వనుంది.