Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీలంక పర్యటన : భారత్ షెడ్యూల్ ఖరారు

శనివారం, 8 జులై 2017 (15:27 IST)

Widgets Magazine
Team-India

భారత క్రికెట్ జట్టు త్వరలో శ్రీలంకలో పర్యటించనుంది. సుమారు ఎనిమిదేళ్ళ తర్వాత భారత్ పూర్తిస్థాయిలో కొలంబో పర్యటనకు శ్రీకారం చుట్టనుంది. మొత్తం 43 రోజుల లంక పర్యటనలో భారత్ 3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ-20 మ్యాచ్ ఆడనుంది. గత 2009లో భారత్‌-శ్రీలంక పూర్తిస్థాయిలో 3 టెస్ట్‌లు, 5 వన్డేలు, రెండు టీ20ల సిరీస్‌లు ఆడాయి. 
 
ఆ తర్వాత 2015 ఆగస్టులో లంక టూర్‌లో టీమిండియా 2-1తో టెస్ట్‌ సిరీస్‌ను నెగ్గింది. అనంతరం శ్రీలంక గడ్డపై భారత జట్టు పర్యటించలేదు. ప్రస్తుతం కరేబియన్ దీవుల్లో ఉన్న టీమిండియా... స్వదేశానికి వచ్చిన తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈనెల 26 నుంచి 30వ తేదీల మధ్య గాలే వేదికగా తొలి టెస్ట్ ఆడనుంది. కొలంబో వేదికగా ఆగస్టు 3 నుంచి 7వ తేదీల మధ్య రెండో టెస్ట్, క్యాండీ వేదికగా ఆగస్టు 12 నుంచి 16వ తేదీల మూడో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. 
 
ఆగస్టు 20వ తేదీన తొలి వన్డే మ్యాచ్ దంబుల్లాలో జరుగనుంది. అలాగే, రెండు, మూడు వన్డేలు ఆగస్టు 24, 27 తేదీల్లో క్యాండీ వేదికగా జరుగనుంది. ఆగస్టు 27, ఆగస్టు 31, సెప్టెంబర్ 3వ తేదీల్లో కొలంబోలోనూ, ఏకైక ట్వంటీ-20 మ్యాచ్ సెప్టెంబర్ 6వ తేదీన కొలంబో వేదికగా జరుగనుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ధోనీ వెళ్లిపోవలసిన సమయం వస్తే తనే తప్పుకుంటాడు.. చిన్ననాటి కోచ్ సమర్థన

జట్టుకు భారమైన క్షణంలో టీమిండియా నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకుంటాడని, ఆ విషయంలో ఒకరు ...

news

ప్రపంచ రికార్డుకు చేరువవుతున్నా గుర్తింపుకు ఆమడదూరంలో మిథాలీ రాజ్

మైదానంలో ప్రశాంతంగా కదులుతూ ఆటను ప్రత్యర్థి జట్టునుంచి లాగిపడేయడంలో మిస్టర్ కూల్ ధోనీని ...

news

సచిన్‌ను దాటిపోయిన విరాట్ కోహ్లీ.. టాస్ ఓడిపోవడంలోనూ రికార్డే...

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను ...

news

హ్యాపీ బర్త్ డే ధోనీ... రవీంద్ర జడేజా ఈ విధంగా విషెస్...

మహేంద్ర సింగ్ ధోనీ 36వ ఏటలోకి ప్రవేశించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు ...

Widgets Magazine