గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (17:15 IST)

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. కరుణ్ నాయర్‌కు చోటు.. విరాట్ కోహ్లీ 20వ టెస్టులోనూ రాణిస్తుందా?

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటివరకు 19 టెస్టుల్లో తన విజయ పరంపరను కొనసాగించింది. దీంతో పాటు వరుసగా ఆరు టెస్టు సిరిస్‌లను కోహ్లీ సేన సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటివరకు 19 టెస్టుల్లో తన విజయ పరంపరను కొనసాగించింది. దీంతో పాటు వరుసగా ఆరు టెస్టు సిరిస్‌లను కోహ్లీ సేన సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో పాల్గొనే టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. 
 
23నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్‌తో ఆడిన జట్టునే ఆస్ట్రేలియా సిరీస్‌తో జరిగనున్న మొదటి రెండు టెస్టులకు కొనసాగించింది. కానీ ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు కరుణ్ నాయర్‌ను తిరిగి జట్టులోకి ఎంపిక చేశారు. ఇంకా కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్‌లకు చోటు కల్పించారు. ఇంగ్లాండ్ సిరిస్‌లో ట్రిపుల్ సెంచరీతో కరుణ్ నాయర్‌ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 
 
ఇదిలా ఉంచితే బంగ్లాదేశ్‌తో టెస్టుకు కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్‌లను ఎంపిక చేసినా, తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. ఐదున్నరేళ్ల క్రితం భారత్‌ తరఫున తన చివరి టెస్టు ఆడిన తమిళనాడు బ్యాట్స్‌మన్‌ ముకుంద్‌కు మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు లభించింది. మరోవైపు కుల్దీప్ యాదవ్ ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరిస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్. రాహుల్, ఛటేశ్వర్ పుజారా, రహానె, కరుణ్ నాయర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్, హార్ధిక్ పాండ్యలకు చోటు దక్కింది.