Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాగ్‌పూర్ వన్డే : భారత్ విజయలక్ష్యం 243 రన్స్

ఆదివారం, 1 అక్టోబరు 2017 (18:08 IST)

Widgets Magazine

ఐదో వన్డేల సిరీస్ సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా జరగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు ముంగిట ఆస్ట్రేలియా 243 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేశారు. 
 
కాగా, ఐదు వన్డేల సిరీస్‌లో 3-1 తేడాతో ఈ సిరీస్‌ను భారత్ ఇప్పటికే కైవసం చేసుకుంది. నాల్గో వన్డేలో ఆసీస్ చేతిలో పరాజయం పొందిన టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఎందుకంటే, ఈ మ్యాచ్‌లో కనుక భారత జట్టు విజయం సాధిస్తే వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకుంటుంది. అలాగే, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ ఆధిక్యాన్ని తగ్గించాలన్న కృతనిశ్చయంతో ఆస్ట్రేలియా ఉంది. 
 
అందుకే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆరంభం నుంచే జాగ్రత్తగా ఆడారు. ఫలితంగా భారీ స్కోర్ చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కుర్రోళ్లు డేవిడ్ వార్నర్ (53), ఫించ్ (32), స్మిత్ (16), హ్యాండ్స్ కాంబ్ (13), టీఎం హెడ్ (42), స్టాయినిస్ (46), ఎంఎస్ వేడ్ (20), జేపీ ఫాల్కనర్ (12), కూల్టర్-నీల్ డకౌట్ (0), కమిన్స్ నాటౌట్ చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 1, బుమ్రా 2, పాండ్యా 1, కేఎం జాదవ్ 1, అక్షర్ పటేల్ 3 చొప్పున వికెట్లు పడగొట్టారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

దశాబ్దన్నర కాలంగా అజిత్ అగార్కర్ రికార్డు పదిలం... ఏంటది?

అజిత్ అగార్కర్. భారత మాజీ క్రికెటర్. ఇతగాడి పేరిట ఉన్న రికార్డు దశాబ్దన్నరకాలంగా పదిలంగా ...

news

బీసీసీఐ చర్యతో బోలెడంత నష్టం వాటిల్లింది.. పీసీబీ గగ్గోలు

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనుసరిస్తున్న వైఖరి వల్ల తమకు బోలెడంత నష్టం ...

news

నేడు చివరి వన్డే.. హోరాహోరీనే... గెలిస్తేనే కోహ్లీసేన నంబర్ వన్

స్వదేశంలో పర్యాటక ఆస్ట్రేలియాతో జరుగుతన్న ఐదు వన్డేల సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ...

news

భారత క్రికెట్‌లో రాజకీయాలెక్కువ.. ప్రేమలో మూడుసార్లు ఫెయిలయ్యా : మిథాలీ రాజ్

భారత క్రికెట్‌పై మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ...

Widgets Magazine