రాంచీ తొలి టీ-20: కోహ్లీ బుల్లెట్ థ్రో అదుర్స్.. 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపు

ఆదివారం, 8 అక్టోబరు 2017 (15:55 IST)

team india

రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన  ట్వంటీ-20 పోరులో మైదానంలో కోహ్లీ పాదరసంలా కదిలాడు. అద్భుత ఫీల్డింగ్‌‌తో అదరగొట్టాడు. తొలి ట్వంటీ-20 పోరులో భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్‌లో డాన్ క్రిస్టియన్ షాట్ కొట్టగా, మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ, చాలాదూరం నుంచి దాన్ని ఓ బుల్లెట్‌లా వికెట్లపైకి విసిరేయగా, అది డైరెక్టుగా వచ్చి వికెట్లను తాకి డాన్‌ను అవుట్ చేసింది. బంతికోసం వికెట్ల వెనుక చేతులు పెట్టి ఉన్న ధోనీ.. బంతి డైరక్టుగానే వికెట్లను తాకడంతో ఒక్క క్షణం అబ్బురపడిపోయాడు. ఆ వెంటనే సహచరుడిని అభినందించేందుకు ముందుకు కదిలాడు. 
 
బాల్ సూపర్‌గా వచ్చి వికెట్లను తాకిందని సైగ చేస్తూ ధోనీ కదిలిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. ఈ మ్యాచ్‌కి వరుణుడు అడ్డు పడగా, డక్వర్త్ లూయిస్ విధానం ప్రకారం, తగ్గించిన ఓవర్లు, పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా అందుకుని విజయం సాధించిన సంగతి తెలిసిందే. కోహ్లీ విసిరిన 'బుల్లెట్ థ్రో' వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
కాగా, వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్‌ పొట్టి ఫార్మాట్‌లోనూ తన ఆధిపత్యాన్ని చూపింది. శనివారం రాత్రి ఇక్కడ జరిగిన తొలి టీ-20లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో తొమ్మిది వికెట్లతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది.దీనిపై మరింత చదవండి :  
India Australia Virat Kohli Ms Dhoni Bullet Throw Run Out Dan Christian

Loading comments ...

క్రికెట్

news

రవీంద్ర జడేజా రెస్టారెంట్‌‌ జడ్జూస్ ఫుడ్ ఫీల్డ్‌కు కొత్త చిక్కు: ఫుడ్‌పై ఫంగస్.. నోటీసులు

భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా రెస్టారెంట్‌ ''జడ్డూస్‌ ఫుడ్‌ ఫీల్డ్‌'' అక్రమ నిర్మాణంగా ...

news

ఐసీసీ కొత్త నిబంధనలు.. ఫేక్ ఫీల్డింగ్.. ధోనీకి శిక్ష తప్పదా?

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త నిబంధనలు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ...

news

ధోనీని అనుకరిస్తూ డాన్స్ చేసిన 'శ్యామ్‌'.. వీడియో వైరల్

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఏం పని చేసినా అది సంచలనమే. పైగా, అలాంటి పనులు చేయడం ...

news

స్టీవ్ స్మిత్‌కు గాయం.. ఆందోళనలో ఆస్ట్రేలియా?

భారత్‌తో ట్వంటీ-20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ...