బౌలర్లు ఓ ఆటాడుకుంటే... బ్యాట్స్‌మెన్స్ చితక్కొట్టారు.. ఓడిన కోహ్లీ సేన

బుధవారం, 11 అక్టోబరు 2017 (06:11 IST)

India-Australia

గౌహతి వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఇక్కడి బర్సపారా మైదానంలో తొలిసారి నిర్వహించిన టీ20లో కోహ్లీ సేన పరాజయం పాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టీ20ని గెలిచిన ఆస్ట్రేలియా 1-1తో సిరీస్‌ సమం చేసి ఆశలు నిలుపుకుంది. ఫలితంగా హైదరాబాద్‌ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోహ్లీ సేనను ఆస్ట్రేలియా ఎడమచేతి వాటం పేసర్‌ బెహ్రన్‌డార్ఫ్‌ (4/21) టాప్‌-4 వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బతీశాడు. అతడికి ఆడమ్‌ జంపా (2/19) తోడవ్వడంతో కోహ్లీసేన కేవలం 118 పరుగులే చాపచుట్టేసింది. భారత జట్టులో కేదార్‌ జాదవ్‌ (27; 27 బంతుల్లో 3×4, 1×6), హార్దిక్‌ పాండ్య (25; 23 బంతుల్లో 1×6), కుల్‌దీప్‌ యాదవ్‌ (16) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్లు అంతా పెవిలియన్‌కు క్యూ కట్టేశారు. 
 
ఆ తర్వాత కేవలం 119 పరుగుల టార్గెట్‌లో బరిలోకి దిగిన కంగారులు సునాయాసంగా గెలుపును కైవసం చేసుకున్నారు. ఆ జట్టు ఓపెనర్లు ఆరోన్‌ ఫించ్‌ (8), డేవిడ్‌ వార్నర్‌ (2) రెండు పరుగుల వ్యవధిలో ఔటయ్యారు. ఫించ్‌ను 1.3వ బంతికి భువి, వార్నర్‌ను 2.5వ బంతికి బుమ్రా పెవిలియన్‌ పంపారు. ఈ క్రమంలో క్రీజ్‌లోకి వచ్చిన మోజెస్‌ హెన్రిక్స్‌ (62 నాటౌట్‌; 46 బంతుల్లో 4×4, 4×6), ట్రావిస్‌ హెడ్‌ (48 నాటౌట్‌; 34 బంతుల్లో 5×4, 1×6)లు భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. 
 
ఫలితంగా మూడో వికెట్‌కు భారత్‌పై టీ20ల్లో 76 బంతుల్లో 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కుల్‌దీప్‌ వేసిన 15వ ఓవర్‌లో హెన్రిక్స్‌ రెండు వరుస సిక్సర్లతో అర్థశతకం సాధించాడు. 15.3వ బంతికి బౌండరీ బాది 8 వికెట్ల తేడాతో మరో 27 బంతులు మిగిలివుండగానే కంగారులు విజయం సాధించారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు ట్వంటీ20 సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

నువ్వు సిక్కువా అని ప్రశ్నించిన నెటిజన్.. కౌంటరిచ్చిన హర్భజన్ సింగ్

టీమిండియా స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ భార్య గీతా బాస్రాను ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన ...

news

నేడు రెండో టీ20 మ్యాచ్... ప్రతీకారం కోసం ఆస్ట్రేలియా

ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం రెండో మ్యాచ్ జరుగనుంది. ఫార్మాట్ ఏదైనా ప్రత్యర్థిపై ...

news

ఒక్క టెస్ట్ సిరీస్‌లో ఓడితే కెప్టెన్సీకి రాజీనామా చేయాలా : బంగ్లా కెప్టెన్ ప్రశ్న

ఒక్క సిరీస్‌లో ఓడినంత మాత్రానా కెప్టెన్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయాలని బంగ్లాదేశ్ ...

news

ధోనీ కుమార్తె జీవాతో సరాదాగా గడిపిన కోహ్లీ.. (వీడియో)

జార్ఖండ్ డైమండ్‌ మ‌హేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాతో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ ...