బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 మార్చి 2017 (17:18 IST)

బెంగళూరు టెస్ట్.. భారత బౌలర్ల చెత్త బౌలింగ్... ఆస్ట్రేలియా స్కోరు 237/6

భారత్-ఆస్ట్రేలియా మధ్య బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆట ముగిసే సమయానికి ఆసీస్ స్కోరు 237/6. భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయారు. ఫలితంగా ఆసీస్ బ్యాట్స్‌మెన్లు నిలకడగా ఆడుతూ ముందు

భారత్-ఆస్ట్రేలియా మధ్య బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆట ముగిసే సమయానికి ఆసీస్ స్కోరు 237/6. భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయారు. ఫలితంగా ఆసీస్ బ్యాట్స్‌మెన్లు నిలకడగా ఆడుతూ ముందుకు సాగారు. కాగా, ఆస్ట్రేలియా ఇప్పటికి భారత్‌పై 48 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టులో పరుగులు చేయడం కన్నా, వికెట్లను కాపాడుకోవడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ జిడ్డుగా సాగింది. ఫలితంగా బెంగళూరులో జరుగుతున్న టెస్టులో లంచ్ విరామ సమయానికి భారత్ రెండు వికెట్లను మాత్రమే తీసింది. 
 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా శనివారం 16 ఓవర్లలో 40 పరుగులు సాధించిన జట్టు, ఆదివారం ఆటలో మరో 29 ఓవర్లను ఎదుర్కొని 47 పరుగులు మాత్రమే సాధించింది. ఈ క్రమంలో ఓపెనర్ వార్నర్, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ స్మిత్ వికెట్లను కోల్పోయింది. 52 బంతులాడిన స్మిత్ 8 పరుగులకు జడేజా బౌలింగ్‌లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రెన్షా 60, స్మిత్ 8, షాన్ మార్ష్ 66, పీటర్ హ్యాండ్ స్కూంబ్ 16, మిచిల్ మార్ష్ 0, మాథ్యూ వేడ్ 25 (నాటౌట్), మిచెల్ స్టార్క్ 14 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. 
 
అంతకుముందు.. భారత జట్టు టెస్టుల్లో అత్యంత చెత్త రికార్డును 40 ఏళ్ల తర్వాత పునరావృతం చేసింది. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో రెండు వందల పరుగుల లోపు 1977 తర్వాత మళ్లీ ఇప్పుడు ఆలౌట్ అయింది. దీంతో మరోసారి చెత్త రికార్డును పునరావృతం చేసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కేవలం 105 పరుగులకే ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 107 పరుగులకే ఆలౌటై ఘోరపరాభవం మూటగట్టుకుంది. 
 
ఇపుడు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 186 పరుగులకే ఆలౌటైంది. దీంతో సొంత గడ్డపై భారత్ వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో 200 పరుగులలోపు 1977 తరువాత మళ్లీ ఇప్పుడే ఆలౌట్ కావడం విశేషం.