Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోహ్లీ ఖాతాలో కొత్త రికార్డు.. ధోనీ, రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కి నెట్టాడు..

సోమవారం, 25 సెప్టెంబరు 2017 (12:42 IST)

Widgets Magazine
virat kohli

వరుసగా అత్యధిక వన్డేల్లో జట్టును గెలిపించిన సారథిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. ఆదివారం ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతేగాకుండా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ నెం.1 స్థానానికి చేరుకుంది. దీంతో విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. వరుసగా అత్యధిక వన్డేల్లో జట్టును గెలిపించిన సారథిగా కోహ్లీ నిలిచాడు. 
 
తద్వారా మాజీ కెప్టెన్లు ధోనీ, రాహుల్ ద్రవిడ్ సరసన కోహ్లీ నిలిచాడు. ధోనీ సారథ్యంలోని టీమిండియా నవంబరు 14, 2008 నుంచి ఫిబ్రవరి 5, 2009 వరకు వరుసగా 9 వన్డేల్లో విజయం సాధించింది. 2006లో జట్టుకు సారథిగా ఉన్న ద్రావిడ్ కూడా వరుసగా తొమ్మిది మ్యాచుల్లో జట్టును గెలిపించాడు.
 
ప్రస్తుతం కోహ్లీ కెప్టెన్సీలోని జట్టు కూడా అదే ఘనతను సాధించింది జూలై 6, 2017 నుంచి సెప్టెంబరు 24, 2017 వరకు వరుసగా 9 వన్డేల్లో జయకేతనం ఎగురవేసింది. తద్వారా వరుసగా అత్యధిక వన్డేలు సాధించిన కెప్టెన్‌గా ధోనీ, రాహుల్ ద్రవిడ్‌లను వెనక్కి నెట్టి.. కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
 
ఇకపోతే ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే భారత్ కైవసం చేసుకుంది. ఇండోర్‌ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో వికెట్ల 5 తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 294 పరుగుల లక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

సిరీస్ టీమిండియాదే.. ఇండోర్ వన్డేలో ఆసీస్ చిత్తు...

సొంతగడ్డపై టీమిండియా సింహంలా గర్జించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను మరో ...

news

ఇండోర్ వన్డే: ఫించ్ సెంచరీ... భారత్ టార్గెట్ 294 పరుగులు

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇండోర్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ...

news

తప్పతాగి పోర్న్ స్టార్‌ చెంప చెళ్లుమనిపించిన మాజీ క్రికెటర్!

ఆయనో క్రికెట్ లెజెండ్. ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న ...

news

నేడు ఇండోర్‌లో మూడో వన్డే... తీవ్ర ఒత్తిడిలో ఆస్ట్రేలియా!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆదివారం కీలకమైన మూడో వన్డేకు ఇండోర్ ...

Widgets Magazine