శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (14:27 IST)

పూణే టెస్టు.. కోహ్లి సేనకు తొలి పరాభవం... 105 పరగులకే ఆలౌట్... 11 పరుగులు 7 వికెట్లు

ఆస్ట్రేలియాతో పూణేలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. కంగారూల బౌలర్ల ధాటికి చతికిలపడ్డారు. ఆసీస్ బౌలర్లు ఇన్నింగ్స్ ఆది నుంచే భారత బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూ

ఆస్ట్రేలియాతో పూణేలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. కంగారూల బౌలర్ల ధాటికి చతికిలపడ్డారు. ఆసీస్ బౌలర్లు ఇన్నింగ్స్ ఆది నుంచే భారత బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా 105 పరుగులకే భారత్ ఆలౌటైంది. 
 
భారత బ్యాట్స్‌మెన్లలో రాహుల్ (64) అర్థ సెంచరీతో రాణించాడు. విజయ్ (10), రహానే (13)ల మినహా ఎవ్వరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. తద్వారా పుజారా (3), కోహ్లీ (0), అశ్విన్ (1), సాహా (0), జడేజా (2), జే యాదవ్ (2), యూటీ యాదవ్ (2)లు సింగిల్ డిజిట్‌ స్కోరుకే పెవిలియన్ క్యూ కట్టారు. దీంతో 40.1 ఓవర్లలో భారత్ 105 పరుగులకే ఆలౌటైంది. చివరి 11 పరుగుల్లోనే 7 వికెట్లు నేల కూలాయంటే టీమ్ ఇండియా ఎంత చెత్తగా ఆడిందో, ఆసీస్ బౌలర్లు ఎంత ధాటిగా ఆడారో అర్థమవుతుంది.
 
ఆస్ట్రేలియా బౌలర్లలో కెఫే ఏకంగా ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. హజెల్ వుడ్, లియోన్, స్టార్క్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల పతనానికి 256 పరుగులు సాధించింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో స్టార్క్ 57, హాజెల్ వుడ్ 94 పరుగులతో రాణించారు.