మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2016 (17:39 IST)

కోహ్లీ సేన అదుర్స్ : మొహాలీ టెస్టులో టీమిండియా గెలుపు.. తీవ్ర ప్రస్టేషన్‌లో ఉన్నానన్న కుక్..

మొహాలీ వేదికగా మూడో టెస్టులో భారత్ విజయాన్ని నమోదు చేసుకుంది. తద్వారా కోహ్లీ సేనకు తిరుగులేదని తేలిపోయింది. టెస్టు పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అపజయాలు మూటగట్టుకోని కోహ్లీ కెరీర్‌లో మరో గెలుపు వచ్చి చే

మొహాలీ వేదికగా మూడో టెస్టులో భారత్ విజయాన్ని నమోదు చేసుకుంది. తద్వారా కోహ్లీ సేనకు తిరుగులేదని తేలిపోయింది. టెస్టు పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అపజయాలు మూటగట్టుకోని కోహ్లీ కెరీర్‌లో మరో గెలుపు వచ్చి చేరింది. కెప్టెన్సీ కెరీర్‌తో పాటు కోహ్లీ కూడా అసాధారణ ఫాంతో పరుగుల యంత్రంగా పేరు కొట్టేశాడు. ఈ నేపథ్యంలో సగటున నాలుగు టెస్టులకు ఒకటి చొప్పున సెంచరీ సాధించాడు. 
 
ఈ నేపథ్యంలో భాగంగా 78/4 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్‌ ను కొన‌సాగించిన ఇంగ్లండ్ టీమ్ 236 ప‌రుగుల‌కే ఆలౌట‌యింది. తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులు సాధించిన ఇంగ్లండ్ టీమిండియాకు స్వల్ప విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. 103 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ పారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. మురళీ విజయ్ (0) కేవలం ఏడు పరుగులకే మొదటి వికెట్ గా పెవిలియన్ చేరాడు. 
 
అనంతరం పార్థివ్‌కు జత కలిసిన పుజారా (25) నిలదొక్కుకున్నాడు. అయితే రషీద్ బౌలింగ్ లో రూట్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆపై దూకుడుగా ఆడిన పార్థివ్ పటేల్ 67 పురుగులు సాధించాడు. కోహ్లీ ఆరు పరుగులకే పరిమితమయ్యాడు. అయినప్పటికీ టీమిండియా 8 వికెట్ల తేడాతో మూడో టెస్టును గెలుచుకుంది. కాగా, టీమిండియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 417 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో మూడు టెస్టులాడిన టీమిండియా.. రెండు టెస్టు మ్యాచ్‌ల్లో గెలుపును సాధించి.. ఆధిక్యంలో నిలిచింది.
 
టీమిండియా ఇంగ్లండ్‍పై గెలిచిన సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. తమ జట్టు క్రీడాకారులు మెరుగ్గా రాణించారని కితాబిచ్చాడు. అయితే తాను తీవ్ర ప్రస్టేషన్‌లో ఉన్నానని.. ఇంగ్లండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ వ్యాఖ్యానించాడు.