Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేడే కీలకమైన రెండో టీ20... సిరీస్ లక్ష్యంగా భారత్

శనివారం, 4 నవంబరు 2017 (09:17 IST)

Widgets Magazine
india vs new zealand

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య అత్యంత కీలకమైన రెండో ట్వంటీ20 మ్యాచ్ జరుగనుంది. సిరీస్ లక్ష్యంగా కోహ్లీ సేన బరిలోకి దిగుతుంటే... ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలుపును సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో కివీస్ ఉంది. దీంతో రాజ్‌కోట్ వేదికగా జరిగే ఈ ట్వంటీ20 మ్యాచ్ పోరు నువ్వానేనా అన్న చందంగా సాగనుంది. 
 
ఢిల్లీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ టీమిండియా ఓపెనర్లు అద్భుతమైన శుభారంభం ఇచ్చారు. దీంతో అదే జట్టు బరిలోకి దిగనుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన ఆశిష్ నెహ్రా స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నదానిపైనే ఇపుడు ఆసక్తి నెలకొంది. బౌలర్ కావాలనుకుంటే హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అలాకాకుండా బ్యాట్స్‌మన్ కావాలనుకుంటే దినేష్ కార్తీక్ లేదా మనిష్ పాండేలలో ఎవరో ఒకరిని జట్టులోకి తీసుకోవచ్చు. టీమిండియా అద్భుతమైన ఫాంలో ఉండగా, ఆటగాళ్లంతా సమష్టిగా రాణిస్తున్నారు. 
 
ఇకపోతే.. కివీస్ జట్టు పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. స్టార్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గుప్టిల్ పూర్తిగా విఫలమయ్యాడు. మున్రో కూడా పెద్దగా రాణించింది లేదు. విలియమ్సన్ కూడా విఫలమయ్యాడు. రాస్ టేలర్ కూడా పెద్దగా ఆకట్టుకున్నది లేదు. దీంతో కివీస్ కష్టాల్లో పడింది. కివీస్ బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో బలంగా ఉంది. కేవలం బ్యాటింగ్ విభాగంగా మాత్రమే తేలిపోతోంది. దీంతో ఈ మ్యాచ్‌తో సత్తా చాటాలని టాప్ ఆర్డర్ భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తిగా మారింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

నీతిమంతమైన ఫాస్ట్ బౌలర్ నెహ్రా : షోయబ్ అక్తర్

రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్‌ చాలా రోజులుకు ఓ మంచి కామెంట్ చేశారు. అదీ కూడా ఇటీవల ...

news

కోహ్లీ అత్యుత్సాహం.. వాకీ టాకీ వాడి చిక్కుల్లో పడ్డాడు.. ఐసీసీ క్లీన్ చిట్

వాకీ టాకీ వాడిన వ్యవహారంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోహ్లీకి క్లీన్ చిట్ ...

news

టీ20లో కివీస్‌ను చితక్కొట్టారు... పొట్టి ఫార్మాట్‌లో భారత్ తొలి విజయం

ఢిల్లీ వేదికగా బుధవారం రాత్రి జరిగిన తొలి ట్వంటీ20లో పర్యాటక జట్టు న్యూజిలాండ్‌ను విరాట్ ...

news

పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు చేతబడి చేయించారట!

క్రికెట్‌లో గెలుపోటములు సహజమే. జట్టులోని సభ్యులంతా సమిష్టిగా ఆడుతూ, అన్ని విభాగాల్లో ...

Widgets Magazine