శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 16 అక్టోబరు 2016 (18:00 IST)

భారత బౌలర్లు అదుర్స్.. 191 పరుగులకే కివీస్ ఆలౌట్: టీమిండియా లక్ష్యం 191

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కివీస్ తన పరువు కాపాడుకుంది. వంద పరుగులు కూడా చేయలేదనుకున్న పరిస్థితి నుంచి న్యూజిలాండ్ జట్టు గట్టెక్కింది. ఉమేష్ యాదవ్‌, పాండ్యాల బౌలింగ్ ద్వయం కివీస్ ఆటగాళ్లను వెంట

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కివీస్ తన పరువు కాపాడుకుంది. వంద పరుగులు కూడా చేయలేదనుకున్న పరిస్థితి నుంచి న్యూజిలాండ్ జట్టు గట్టెక్కింది.  ఉమేష్ యాదవ్‌, పాండ్యాల బౌలింగ్ ద్వయం కివీస్ ఆటగాళ్లను వెంటవెంటనే ఔట్ చేసింది. దీంతో 43.5 ఓవర్లలో 190 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. కివీస్ ఆటగాళ్లు భారత బౌలర్ల ధాటికి వణికిపోయారు. 
 
అంతకుముందు 32 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 107 పరుగులు మాత్రమే చేసిన కివీస్ జట్టును టిమ్ సౌథీ తన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది 55 పరుగులు రాబట్టాడు. సౌథీతో పాటు ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగి చివరి వరకూ నాటౌట్‌గా నిలిచిన టామ్ లాథమ్ 79 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 43.5 ఓవర్లలో 190 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది.
 
టాప్ ఆర్డర్ వరుసగా విఫలమవ్వడంతో ఆ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. టెస్టు సిరీస్‌లో వైట్ వాష్ అయిన కివీస్ జట్టు ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో పేలవమైన ఆటతీరుతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. దీంతో కేవలం 65 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో హర్ధిక్ పాండ్యా 3, అమిత్ మిశ్రా 3, ఉమేష్ యాదవ్ 2, కేదర్ జాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.