గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (14:07 IST)

మొహాలీ వన్డేలో ధోనీ రికార్డుల మోత.. సెంచరీని ఎందుకు మిస్ చేసుకున్నాడో తెలుసా?

మొహాలీలో కివీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వన్డేల్లో 50కి పైగా సగటుతో 9 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక క్రికెటర్గా

మొహాలీలో కివీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వన్డేల్లో 50కి పైగా సగటుతో 9 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక క్రికెటర్గా అరుదైన రికార్డు నెలకొల్పిన ధోనీ.. సచిన్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. వన్డేల్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా ధోనీ (196) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అంతేగాక వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు సంధించిన కెప్టెన్గా మరో ఘనత సాధించాడు.
 
దీంతో కివీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోనీ అద్భుత ఆటతీరుతో జట్టు విజయంలో తనదైన పాత్ర పోషించాడు. ధోనీ, కోహ్లీ కలిసి అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే 80 వ్యక్తిగత స్కోర్ వద్ద ధోనీ ఔటయ్యాడు. హెన్రీ బౌలింగ్‌లో రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 
 
సెంచరీకి 20 పరుగుల దూరంలో ధోనీ ఔట్ కావడంతో ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. మ్యాచ్ అనంతరం ధోనీ సెంచరీ మిస్‌ గురించి ఏమన్నాడంటే..? క్రీజులో స్వేచ్ఛగా ఆడటంతో కొంతవరకూ శక్తిని కోల్పోయానని చెప్పాడు. ఆ టెన్షన్‌లో అవుట్ అయ్యానని వివరణ ఇచ్చాడు. సెంచరీ సంగతిని పక్కనబెట్టి జట్టు విజయానికి కావాల్సిన పరుగులు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. ఇక టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిందని ధోనీ కొనియాడాడు.