గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 అక్టోబరు 2015 (10:18 IST)

క్రికెట్ సమరం : నేడు భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య ట్వంటీ-20 మ్యాచ్

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య క్రికెట్ సమరం నేటి నుంచి ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా ఆ రెండు జట్ల మధ్య తొలి ట్వంటీ-20 మ్యాచ్ శుక్రవారం జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ధర్మశాల వేదిక కానుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి దక్షిణాఫ్రికా జట్టు భారత్ ఏ జట్టుతో జరిగిన ఏకైక వామప్ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. అయినప్పటికీ, అసలు సిసలైన సమరంలో మాత్రం తడాఖా చూపిస్తామని సఫారీలు హెచ్చరిస్తుంటే... సౌతాఫ్రికాను ఓడించడం ఖాయమని టీమిండియా కుర్రోళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 
ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే భారత్ కంటే దక్షిణాఫ్రికా జట్టే బలంగా ఉంది. ముఖ్యంగా, బ్యాటింగ్ బౌలింగ్‌లో వరల్డ్‌క్లాస్ ప్లేయర్లున్నారు. దీంతో ఈ క్రికెట్ సిరీస్‌లో సఫారీలదే పైచేయిగా ఉంది. అయితే, సొంతగడ్డపై భారత క్రికెటర్లు సింహాల్లా గర్జిస్తుంటారు. ఎలాంటి జట్టునైనా చిత్తు చేసే శక్తిసామర్థ్యాలు భారత జట్టుకు ఉంది. దీంతో ఈ సిరీస్ మెన్ ఇన్ బ్లూ సమరంగా మారిపోయింది. 
 
ఇరు జట్ల అంచనా.. 
భారత్.. ధోనీ (కెప్టెన్), అరవింద్, అశ్విన్, బిన్నీ, ధవాన్, హర్భజన్ సింగ్, కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, మిశ్రా, పటేల్, రహానే, రైనా, అంబటి రాయుడు, శర్మ, రోహిత్ శర్మ. 
 
దక్షిణాఫ్రికా.. డు ప్లీసిస్, అబ్బాట్, ఆమ్లా, బెహార్దీన్, కాక్, డీ లాంగే, డీ విలియర్స్, జేపీ డుమ్నీ, ఇమ్రాన్ తాహీర్, లై, మిల్లర్, మోర్కెల్, మోరీస్, రబాడా, జోండో.