Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సఫారీలకు కాళరాత్రి... సౌతాఫ్రికా గడ్డపై కోహ్లీ సేన సరికొత్త చరిత్ర

బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (14:12 IST)

Widgets Magazine
team india

ఆఫ్రికా గడ్డపై విరాట్ చరిత్ర సృష్టించింది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగుతున్న ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత క్రికెట్ జట్టు మరో మ్యాచ్ మిగిలివుండగానే కైవసం చేసుకుంది. ఫలితంగా రెండున్నర దశాబ్దాల పోరాటం ఫలించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి సిరీస్‌ నెగ్గి తన కలను సాకారం చేసుకుంది. వన్డేల్లో నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను పదిలం చేసుకుంది.  
 
ఈ వన్డే సిరీస్‌లో భాగంగా పోర్ట్‌ ఎలిజబెత్ వేదికగా ఐదో వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత క్రికెట్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 274 పరుగులు చేసింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్' రోహిత్‌(126 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 115)తో పాటు కెప్టెన్‌ కోహ్లీ (36), శిఖర్‌ ధవన్‌ (34), శ్రేయాస్‌ అయ్య ర్‌ (30) రాణించారు. ఒక దశలో 35 ఓవర్లకు 196/3తో నిలిచిన భారత్‌ను పేసర్‌ ఎన్‌గిడి (9-1-51-4) కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌తో భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు.
 
ఆ తర్వాత  275 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి తిగిన కోహ్లీ సేన ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే ఔట్ చేసింది. తొలుత బ్యాటింగ్‌లోనే కాకుండా, ఆ తర్వాత బంతితోనూ సత్తా చాటిన కోహ్లీసేన ఛేదనలో సఫారీలను 42.2 ఓవర్లలో 201 రన్స్‌కే కుప్పకూల్చింది. ఆమ్లా (71) పోరాడినా ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పలేదు. 2 వికెట్లతో పాటు కీలక రనౌట్‌ చేసిన పాండ్యా ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. నామమాత్రమైన చివరి వన్డే 16న జరగనుంది. 
 
ఈ వన్డే సిరీస్ విజయంతో టెస్టు సిరీస్‌ పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. ఫలితంగా శివరాత్రి పర్వదినాన.. శాసించే ఆటతో సఫారీలకు కాళరాత్రిని మిగిల్చిన భారత్‌ తమను ఆరాధించే అభిమానులు చిరకాలం గుర్తుంచుకునేలా ప్రేమికుల దినోత్సవ కానుక ఇచ్చింది.
 
స్కోరు వివరాలు... 
భారత్ : ధావన్‌ 34, రోహిత్‌ 115, కోహ్లీ 36, రహానె (రనౌట్‌) 8, శ్రేయాస్‌ 30, హార్దిక్‌ పాండ్యా 0, ధోనీ 13, భువనేశ్వర్‌ (నాటౌట్‌) 19, కుల్దీప్‌ (నాటౌట్‌) 2, అదనపు రన్స్ 17.. మొత్తం 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 274. 
 
దక్షిణాఫ్రికా : ఆమ్లా (రనౌట్‌/పాండ్యా) 71, మార్‌క్రమ్‌ 32, డుమిని 1, డివిల్లీర్స్‌ 6, మిల్లర్‌ 36, క్లాసెన్‌ 39, పెహ్లుక్వాయో 0, రబాడ 3, మోర్కెల్‌ 1, షంసి 0, ఎన్‌గిడి (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 42.2 ఓవర్లలో 201 ఆలౌట్‌. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

హార్దిక్ పాండ్యాతో ఆ సంబంధమా? తప్పుడు వార్తలు రాస్తారా?

గతంలో టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యాతో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా డేటింగ్‌లో ఉన్నాడనే ...

news

పింక్ డ్రెస్సే దక్షిణాఫ్రికా విజయానికి కారణమా? సోషల్ మీడియాలో వైరల్

భారత్‌తో శనివారం జరిగిన వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపును నమోదు చేసుకోవడంపై సోషల్ మీడియాలో ...

news

శిఖర్ ధావన్ 100వ వన్డేలో మరో సెంచరీ... బ్యాటింగ్ కెరీర్ ఎలా వుందో తెలుసా?

శిఖర్ ధావన్ ఇవాళ తన 100వ వన్డేలో సెంచరీ నమోదు చేసుకున్నాడు. దక్షిణాఫ్రియా-భారత్ జట్ల మధ్య ...

news

శిఖర్ ధావన్ 100.. కోహ్లీ 75 పరుగులకే అవుట్.. అయినా రికార్డుల పంట

దక్షిణాఫ్రికాతో జోహెన్స్‌బర్గ్‌లో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్లు ...

Widgets Magazine