శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 జులై 2016 (11:04 IST)

విరాట్ కోహ్లీ అదుర్స్.. 143 పరుగులతో విండీస్ బౌలర్లకు చుక్కలు.. టెస్టుల్లో 12వ సెంచరీ నమోదు!

వెస్టిండీస్-భారత్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ గురువారం రాత్రి మొదలైంది. తొలి టెస్టు తొలి రోజులో భారత జట్టు తన సత్తా చాటుతోంది. భారత బ్యాట్స్‌మెన్లు తమ బ్యాట్లకు పనిచెప్పారు. ముఖ్యంగా భారత కెప్టెన్

వెస్టిండీస్-భారత్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ గురువారం రాత్రి మొదలైంది. తొలి టెస్టు తొలి రోజులో భారత జట్టు తన సత్తా చాటుతోంది. భారత బ్యాట్స్‌మెన్లు తమ బ్యాట్లకు పనిచెప్పారు. ముఖ్యంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్ మొదటి బ్యాటింగ్ ఎంచుకుంది. 
 
ఓపెనర్ మురళీ విజయ్ (7), ఛటేశ్వర్ పుజారా (16)లు స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (84)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ(143 నాటౌట్) చెలరేగిపోయారు. సెంచరీకి చేరువైన ధావన్ శతకం చేయకుండానే వెనుదిరగగా.. కోహ్లీ మాత్రం సెంచరీతో రాణించి తొలి రోజు నాటౌట్‌గా నిలిచాడు. తొలి రోజు తన ఇన్నింగ్స్‌లో మొత్తం 197 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ.. 16 ఫోర్లుతో 143 పరుగులు చేయడం విశేషం. ఈ సెంచరీతో టెస్టుల్లో 12వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 
 
ఇంకా సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ కెప్టెన్గా టెస్టుల్లో 1000 పరుగులు పూర్తిచేసుకోవడం విశేషం. విండీస్‌పై శతకాలు సాధించిన టీమిండియా కెప్టెన్లలో మూడోవ్యక్తిగా విరాట్‌ కోహ్లీ నిలిచాడు. 1982-83లో స్పెయిన్‌లో కపిల్‌దేవ్‌ (100) పరుగులు చేయగా, 2006లో రాహుల్‌ ద్రావిడ్‌ 146 పరుగులు చేశాడు. మరో 4 పరుగులు జతచేస్తే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ గానూ మరో రికార్డుకు కోహ్లీ చేరువలో ఉన్నాడు.
 
మరోవైపు విండీస్ గడ్డపై సెంచరీ నమోదు చేసుకున్న విరాట్ కోహ్లీ రికార్డుల పంట పండించాడు. 2011లో తొలిసారి వెస్టిండీస్ పర్యటనతోనే తన టెస్ట్ కెరీర్ ఆరంభించాడు. తాజా సిరీస్‌లో తొలి టెస్టులో తన విశ్వరూపం చూపించాడు. 143 పరుగులతో అజేయంగా నిలిచాడు. అద్భుత ఆటతీరును ప్రదర్శించిన కోహ్లీ 73 ఇన్నింగ్స్‌లలో 3 వేల పరుగులు పూర్తిచేసి వ్యక్తిగత మైలురాయిని చేరుకున్నాడు. 
 
ఇప్పటివరకు 41 టెస్టుల్లో 72 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ 2994 పరుగులు చేసి మరో రికార్డుకు ఆరు పరుగుల దూరంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆంటిగ్వా టెస్టులో వ్యక్తిగత స్కోరు 6 పరుగుల వద్ద మూడువేల పరుగుల మైలురాయి అందుకున్నాడు.
 
ఇక విండీస్ తొలి టెస్టు రెండో రోజు ఆటను కూడా కోహ్లీ ప్రారంభించనున్నాడు. ధావన్ కూడా వెనుదిరగడంతో కోహ్లీతో రవిచంద్రన్ అశ్విన్ (18) జత కలిశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 302 పరుగులు చేసిన భారత్.. 4 వికెట్లు కోల్పోయింది. దీనితో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరును నమోదు చేసుకునే దిశగా దూసుకెళ్తోంది.