శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (11:36 IST)

నాగ్‌పూర్ టెస్ట్‌లో భారత స్పిన్నర్ల మాయాజాలం : 79 రన్స్‌కే సఫారీలు ఆలౌట్

నాగ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు తమ చేతివేళ్ళ మాయాజాలాన్ని ప్రదర్శించారు. ఫలితంగా పర్యాటక సఫారీ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 79 పరుగులకే ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్లలో అశ్విన్‌ ఐదు వికెట్లు తీయగా, జడేజా నాలుగు, అమిత్ మిశ్రాల ఒక వికెట్ చొప్పున తీసి సఫారీల నడ్డివిరిచారు. ఫలితంగా భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో అమూల్యమైన 136 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా తన తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 215 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీ బౌలర్లు విజృంభించడంతో భారత బ్యాట్స్‌మెన్లు సాఫీగా బ్యాటింగ్ చేయలేక ఒకరి వెనుక ఒకరు పెవిలియన్‌కు క్యూకట్టారు. భారత బ్యాట్స్‌మెన్లలో విజయ్ 40, ధావన్ 12, పుజరా 21, కోహ్లీ 22, రహాన్ 13, రోహిత్ శర్మ 2, వృద్ధిమాన్ సాహు 32, రవీంద్ర జడేజా 34, అశ్విన్ 15, మిశ్రా 3, ఇషాంత్ శర్మ 0 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో హార్మెర్ 4, మోర్కెల్ 3, రబడా, ఎల్గర్, ఇమ్రాన్ తాహీర్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సఫారీలు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 11/2 పరుగులు చేసింది. తొలి రోజు ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీలు... భారత స్పిన్నర్ల ధాటికి నిలువలేక పోయారు. ఫలితంగా... కేవలం 79 పరుగులకే ఆలౌట్ అయ్యారు. సఫారీ బ్యాట్స్‌మెన్లలో ఎల్గర్ 7, వాన్ జిల్ 0, తాహీర్ 4, ఆమ్లా 1, డీ విల్లియర్స్ 0, ప్లెసెస్ 10, డుమ్నీ 35, విలాస్ 1, హార్మెర్ 13, రబడా 6 (నాటౌట్), మోర్కెల్ 1 చొప్పున పరుగులు చేశారు. కాగా, సఫారీల తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 32 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అలాగే జడేజా 33 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.