గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (12:13 IST)

ఐపీఎల్ 8వ సీజన్: కోహ్లీ అదుర్స్.. రాజస్థాన్‌ చిత్తు.. బెంగళూర్ విన్!

ఐపీఎల్ 8వ సీజన్లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన ట్వంటీ-20 మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస వైఫల్యాలకు చెక్ పెట్టింది. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పాటు విధ్వంసక బ్యాట్స్‌మన్ డివిలియర్స్ రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. తొలుత బౌలర్లు రాణించడంతో, 130 పరుగులకే పరిమితమైన రాజస్థాన్ జట్టు ఆపై ఫీల్డింగ్‌లోనూ చేతులెత్తేసింది. 
 
ఇక బెంగళూరు జట్టులో ఓపెనర్ క్రిస్‌గేల్ (17 బంతుల్లో 20) తక్కువ పరుగులకే అవుట్ అయినా, కెప్టెన్ విరాట్ కోహ్లి (46 బంతుల్లో 62), డివిలియర్స్ (34 బంతుల్లో 47) చెలరేగి ఆడి 16.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి జట్టుకు విజయాన్ని అందించారు.
 
కీలక మ్యాచ్‌లో బెంగళూరు వీరవిహారం చేసింది. బౌలింగ్‌లో స్టార్క్, బ్యాటింగ్‌లో కోహ్లీ చెలరేగడంతో బెంగళూరు 9 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 130 పరుగులు సాధించింది. అయితే బెంగళూరు 16.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్టార్క్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.