గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 27 మే 2015 (20:58 IST)

రూ. 16 కోట్లు పోసి కొనుక్కున్న చెత్త ఆటగాడు యువరాజ్ సింగ్... యూవీకి చేదు గుళిక

ఆటగాడి గ్రాఫ్ అన్నివేళలా ఒకలా ఉండదు కదా. ఆల్ రౌండర్ బ్యాట్సమన్ యువరాజ్ సింగ్ కూడా ఇందుకు అతీతుడేమీ కాదు. ఐపీఎల్ 8 సీజన్లో అత్యంత చెత్త ఆటగాడు ఎవరయ్యా అని పోల్ నిర్వహిస్తూ యూవీ నెం.1 స్థానంలో నిలిచాడు మరి. ఇతడిని ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ రూ. 16 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. 
 
ఐతే యూవీ మొత్తం 13 ఇన్నింగ్సులలో చేసిన పరుగులు కేవలం 248 మాత్రమే. సగటు పరుగుల రేటు కూడా 19.07 కావడంతో ఆన్ లైన్లో అత్యధికులు మోస్ట్ వేస్ట్ ప్లేయర్ ఎవరని అడిగితే యువరాజ్ సింగుకు ఓటు వేశారు. ఇలా పూర్తిగా చెత్త ఆటగాడిగా మారిన యువరాజ్ సింగును వచ్చే ఐపీఎల్ సీజనులో ఇక పట్టించుకోరనే కామెంట్స్ వినబడుతున్నాయి.