శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 మార్చి 2017 (11:28 IST)

బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్.. ద్రవిడ్‌కు కొత్త చిక్కు.. టీమిండియానా? ఐపీఎల్‌లా?

టీమిండియా ది వాల్ రాహుల్ ద్రవిడ్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. భారత్ ఎ, అండర్-19 లాంటి జాతీయ జట్లకు ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న ద్రవిడ్ త్వరలో ఆరంభం కానున్న ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట

టీమిండియా ది వాల్ రాహుల్ ద్రవిడ్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. భారత్ ఎ, అండర్-19 లాంటి జాతీయ జట్లకు ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న ద్రవిడ్ త్వరలో ఆరంభం కానున్న ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల అమల్లో భాగంగా రానున్న సీజన్‌ కోసం ఏడాది కాలానికి బీసీసీఐ త్వరలో కొత్త కాంట్రాక్టు విధానాన్ని తీసుకురాబోతున్నది.

బీసీసీఐ సీఓఏ కొత్త కాంట్రాక్టు ప్రకారం జోడు పదవుల్లో కొనసాగడం ద్వంద్వ ప్రయోజనాల కోసమే అవుతుంది. దీంతో ద్రవిడ్ టీమిండియాను దూరం చేసుకోవాలా.. ఐపీఎల్‌కు దగ్గర కావాలా అనే దానిపై సరైన నిర్ణయానికి రాలేకపోతున్నాడు. 
 
బీసీసీఐతో ద్రవిడ్‌ కాంట్రాక్టు మరో 10 నెలలు కొనసాగనుంది. ఈ పరిస్థితుల్లో దేశమా.. ఐపీఎలా..? ద్రవిడ్ ఎటువైపు మొగ్గుచూపుతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే బీసీసీఐ కొత్త విధానంతో ద్రవిడ్‌కు వచ్చిన సమస్య ఏమీ లేదన్నది విశ్లేషకుల వాదన. ఐపీఎల్‌ ఫ్రాంచైజీకి పనిచేసినందుకుగానూ అతను ఎంత మొత్తం తీసుకుంటాడో అదే మొత్తాన్ని చెల్లించి అండర్‌-19 కోచ్‌గా కొనసాగాలని సూచించే అవకాశం ఉంది.