శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (17:38 IST)

ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న పాక్ అంపైర్‌పై బీసీసీఐ వేటు!

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్థాన్ అంపైర్‌పై బీసీసీఐ బహిష్కరణ వేటు వేసింది. వచ్చే ఐదేళ్ల పాటు అతనిపై నిషేధం కొనసాగుతుందని బీసీసీఐ తేల్చి చెప్పింది. రవూఫ్ పాత్రపై విచారించిన ఐసీసీ క్రమశిక్షణా కమిటీ ఛాంపియన్స్ ట్రోఫీ  నుంచి అతన్ని పక్కనబెట్టగా.. ప్రస్తుతం బీసీసీఐ శిక్షను ఖరారు చేసింది. ఇదే కేసులో ఆటగాళ్లు అంకిత్ చవాన్, శ్రీశాంత్, చండీలాలపై ఇప్పటికే బీసీసీఐ చర్యలు తీసుకుంది. 
 
ఇదిలా ఉంటే.. ప్రపంచకప్‌లో తమ జట్టు ప్రాతినిథ్యంపై వారంలోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మీడియా డైరెక్టర్ అంజాద్ హుస్సేన్ తెలిపారు. భారత్‌లో ఆడే ప్రతి దేశ జట్టుకు భద్రత కల్పిస్తామని, ఇందులో ఎలాంటి ఆందోళన అనవసరమని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ బుధవారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో పీసీబీ స్పందించింది.