శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 25 జులై 2015 (17:18 IST)

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్.. దోషులంతా నిర్దోషులే.. ఢిల్లీ హైకోర్టు తీర్పు :: ఏడ్చేసిన శ్రీశాంత్

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు శనివారం సంచలన తీర్పును వెలువరించింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషులుగా ప్రకటించిన వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. దీంతో ఢిల్లీ పోలీసులు దోషులుగా నిలబెట్టిన 16 మంది క్రికెటర్లను నిర్ధోషులుగా విముక్తులయ్యారు. 
 
స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని కేసు నమోదు చేసిన పోలీసులు, ఆరోపణలను రుజువు చేయలేకపోయారని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. దీంతో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం బయటపడినప్పటి నుంచి నిషేధం వేటు ఎదుర్కొంటున్న 16 మంది క్రికెటర్లు హర్షం వ్యక్తంచేశారు. ఢిల్లీ పోలీసుల ఆరోపణలతో 16 మంది క్రికెటర్ల కెరీర్ ప్రమాదంలో పడింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుతో వారంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. 
 
మరోవైపు తుది తీర్పు కోసం కోర్టుకు వచ్చిన ఆ 16 మంది క్రికెటర్లలో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా కూడా ఉన్నారు. వీరు కోర్టు తీర్పు అనంతరం కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న రోజు రానేవచ్చిందంటూ హర్షం వ్యక్తంచేశారు. కళంకిత ముద్ర పోగొట్టుకున్నామని చెప్పారు. ఆరోపణలతో అరెస్టైన రోజే శ్రీశాంత్ మాట్లాడుతూ, తాను నిర్థోషినని, కేసులోంచి కడిగిన ముత్యంలా తిరిగి వస్తానని పేర్కొన్న సంగతితెలిసిందే. అతని నమ్మకం కోర్టు తీర్పుతో రుజువైంది.