శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (12:33 IST)

శ్రీలంక టెస్టు సిరీస్: క్రికెటర్ల ఓవరాక్షన్‌పై ఐసీసీ సీరియస్

భారత్, శ్రీలంకల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు, నాలుగో రోజు ఆటలో ఓవరాక్షన్ చేసిన క్రికెటర్లపై ఐసీసీ సీరియస్ అయ్యింది. నాలుగో రోజు ఆటలో సంయమనాన్ని మరచి వాగ్వాదానికి దిగిన నలుగురు ఆటగాళ్లపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సీరియస్‌గా తీసుకుంది. భారత బౌలర్ ఇషాంత్ శర్మ, శ్రీలంక ఆటగాళ్లు చండిమాల్, తిరిమానే, దమ్మిక ప్రసాద్‌లపై క్రమశిక్షణా చర్యలను తీసుకోవాలని నిర్ణయించింది. 
 
ఇషాంత్ శర్మకు లంక బౌలర్ దమ్మిక ప్రసాద్ వరుసగా బౌన్సర్లు వేయడం, ఆపై ఇషాంత్ మరో బౌన్సర్ వేయమంటూ, తల చూపించడం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపి ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటామని ఐసీసీ అధికారులు పేర్కొన్నారు.
 
ఇషాంత్ శర్మ రెండో టెస్టులో ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించడంతో 65శాతం ఫీజులో కోత విధించిన సంగతి తెలిసిందే. అలాగే లంక బౌలర్లైన చండీమల్, తిరిమన్నేలపై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. రెండో టెస్టులో భాగంగా 30 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించారు.