గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 2 ఫిబ్రవరి 2017 (03:53 IST)

వికెట్లను ఇలా టపటపలాడిస్తారని ఎవరనుకున్నారు: ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ విచారం

మ్యాచ్ ఫలితం మాకు అనుకూలంగా ఉన్న స్థితిలో వరుసగా ఇద్దరు బ్యాట్స్‌మన్‌లను కోల్పోవడం మావైపు జరిగిన అతి పెద్ద తప్పిదం అన్నాడు ఇంగ్లండ్ టి20 జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. చాహల్ అద్వితీయ బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువేననీ, సీరిస్‌ను గెల్చుకోగలిగిన ప

మ్యాచ్ ఫలితం మాకు అనుకూలంగా ఉన్న స్థితిలో వరుసగా ఇద్దరు బ్యాట్స్‌మన్‌లను కోల్పోవడం మావైపు జరిగిన అతి పెద్ద తప్పిదం అన్నాడు ఇంగ్లండ్ టి20 జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. చాహల్ అద్వితీయ బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువేననీ, సీరిస్‌ను గెల్చుకోగలిగిన ప్రావీణ్యతను టీమిండియా ప్రదర్శించిందని కితాబిచ్చాడు. నేను జో రూట్ చెరోక 70 లేదా 80 పరుగులు చేసి ఉంటే ఫలితం మరొకలా ఉండేది కాని ఈరోజు అది ఫలించలేదు. ఒకరకంగా చెప్పాలంటే బ్యాటింగ్‌కు అద్బుతంగా వీలిచ్చే వికెట్ ఇది. చిన్న మైదానం. వాతావరణం కూడా బాగుంది. ప్రారంభంలోనే 190 పరుగుల వరకు ఇచ్చాం. ఏదేమైనా మా బ్యాటింగ్ ప్రదర్శన గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత చెత్తగా ఉంది. అయితే దీనిపై మేం అంత కలవరపడాల్సిన పనిలేదు అని మోర్గాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత విశ్లేషించాడు.
 
దాదాపు 60 శాతం గేమ్ మాకు అనుకూలంగా ఉన్న దశలో ఓవర్‌లో రెండు వికెట్లు సమర్పించుకున్నాం. చివరలో వికెట్లు ఘోరంగా పతనం కావడానికి కారణం తీవ్ర ఒత్తిడి. భారత్‌కు అభినందనలు. సీరీస్ గెలిచే అర్హత దానికి ఉంది అన్నాడు మోర్గన్,. 
 
వాస్తవానికి ఇంగ్లండ్ జట్టులో కేవలం 8 పరుగుల్లో 8 వికెట్లు కూలిపోవడమంటే ఆషామాషీ విషయం కాదు. ఈ స్థాయిలో తమ ఇన్నింగ్స్‌ కుప్పకూలిపోతుందని ఇంగ్లాండ్‌ ఊహించి వుండదు. బెంగళూరులోని చెన్నస్వామి మైదానంలో టీమిండియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో 8 పరుగులకే తొలి వికెట్‌ని కోల్పోయిన ఇంగ్లాండ్‌, ఆ తర్వాత కాస్సేపు నిలదొక్కుకున్నట్లే కనిపించింది. 55 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయాక కూడా ధాటిగానే కనిపించింది. ఎప్పుడైతే 119 పరుగుల వద్ద మూడో వికెట్‌ని ఇంగ్లాండ్‌ కోల్పోయిందో, ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఇక కోలుకోలేదు. 
 
టపా టపా వికెట్లు పడిపోతూనే వున్నాయి. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ క్రీజ్‌లోకి రావడం, పెవిలియన్‌కి వెళ్ళడం. ఇదే తంతు. జస్ట్‌ 8 పరుగుల్లోనే చివరి 8 వికెట్లను ఇంగ్లాండ్‌ కోల్పోయింది. 127 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా 75 పరుగులతో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించింది చాహల్‌ అని చెప్పక తప్పదు. టీ20 మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు, ఆ పైన దక్కించుకోవడం చిన్న విషయం కాదు. కానీ, ఈ మ్యాచ్‌లో చాహల్‌ 6 వికెట్లు సాధించాడు. 
 
అంతకుముందు బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 202 పరుగులు సాధించింది. ధోనీ, రైనా అర్థ సెంచరీలతో చెలరేగిపోగా, యువరాజ్‌సింగ్‌ 10 బంతుల్లోనే 23 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మొత్తమ్మీద, ఈ గెలుపుతో టీమిండియా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని 2-1 తేడాతో సొంతం చేసుకుంది.