శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (14:38 IST)

బీసీసీఐకు కొత్త బాస్.. మళ్లీ జగ్మోహన్ దాల్మియా ఇన్నింగ్స్ స్టార్ట్!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పగ్గాలను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మరోమారు కైవసం చేసుకున్నారు. సోమవారం చెన్నైలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన బీసీసీఐ చీఫ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగాల్‌కు చెందిన మాజీ క్రికెటర్ దాల్మియా దశాబ్ద కాలం తర్వాత బీసీసీఐ అధ్యక్ష స్థానాన్ని మరోమారు కైవసం చేసుకున్నారు. దీంతో బీసీసీఐలో ఆయన ఇన్నింగ్స్ మళ్లీ ఆరంభమైనట్టుగా చెపుతున్నారు. 
 
ఐపీఎల్ వివాదం నేపథ్యంలో బీసీసీఐ ఎన్నికలకు శ్రీని దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఎన్.శ్రీనివాసన్ తనకు అనుకూలమైన దాల్మియా ఈ పదవిలో కూర్చోబెట్టేందుకు పావులు కదిపారు. ఈ పదవికి గట్టి పోటీదారుడిగా నిలవడానికి ప్రయత్నించిన మాజీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు ఈస్ట్ జోన్ నుంచి ఎవరూ మద్దతుగా నిలువలేదు. దీంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఎన్నిక  ఏకగ్రీవమైంది. గతంలో 2001 నుంచి 2004 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు దాల్మియా.