బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (17:14 IST)

సౌత్ ఆఫ్రికా క్రికెటర్ కుమార్తెకు ఇండియా పేరు..!

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీరోడ్స్ దంపతులకు పాప జన్మించిన సంగతి తెలిసిందే. రోడ్స్ భార్య మెలానీ ముంబయిలోని శాంతాక్రజ్‌లో ఉన్న సూర్యా మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లో గురువారం పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ పాపాయికి రోడ్స్ దంపతులు 'ఇండియా జియాన్నే రోడ్స్' అని నామకరణం చేశారు. ఈ మేరకు రోడ్స్ ట్వీట్ చేశాడు. 
 
రోడ్స్ అర్థాంగి మెలానీ 'వాటర్ బర్త్' విధానంలో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ లో రోడ్స్ ముంబయి ఇండియన్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. కాగా, తల్లికి, బిడ్డకు ఎంతో మేలు కలిగే 'వాటర్ బర్త్' విధానం ఇండియాలో అంత ప్రాచుర్యం పొందలేదు. అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో మాత్రం అత్యధిక జననాలు ఈ విధానంలోనే జరుగుతున్నాయి.