బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 30 మే 2015 (12:17 IST)

విరాటో కోహ్లీకి కపిల్ సలహాలు.. వేగంగా నేర్చుకోవయ్యా..

టీమిండియా స్టార్ ప్లేయర్, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సలహా ఇచ్చాడు. వేగంగా నేర్చుకోవాలని సూచించాడు. వేగంగా నేర్చుకోవడం కెప్టెన్ లక్షణాల్లో మొదటిదై ఉండాలన్నాడు. 
 
మహేంద్ర సింగ్ ధోనీలోని కెప్టెన్సీ లక్షణాలను విరాట్ కోహ్లీ అందిపుచ్చుకోవాలని కపిల్ దేవ్ హితవు పలికాడు. విరాట్ కోహ్లీ గ్రౌండులో చాలా దూకుడుగా ఉంటాడని వ్యాఖ్యానించిన ఆయన, అతనిలో భావోద్వేగాలు స్పష్టంగా తెలిసి పోతాయన్నాడు.
 
ధోనీ కూడా తప్పులు చేసినా చాలా వేగంగా నేర్చుకున్నాడని, ఒకదశలో తానూ తప్పులు చేసినా వెంటనే సరిదిద్దుకున్నానని తెలిపాడు. కెప్టెన్‌గా విధులు నిర్వహిస్తున్న వేళ సొంత ప్రదర్శన కన్నా జట్టు రాణించడం ముఖ్యమని కపిల్ తెలిపాడు.