శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 12 మే 2018 (15:28 IST)

అనిల్ కుంబ్లే ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్.. ఇంతకు అదేంటి?

కర్ణాటక ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతున్న వేళ అదే రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ట్విటర్ వేదికగా ఓటర్లకు ఓ మెసేజ్ ఇచ్చారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్న వేళ తీసిన ఫోటోను ట్విట్టర్లో

కర్ణాటక ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతున్న వేళ అదే రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ట్విటర్ వేదికగా ఓటర్లకు ఓ మెసేజ్ ఇచ్చారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్న వేళ తీసిన ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ దేశ పౌరులుగా మీ హక్కును వినియోగించుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు వచ్చిన కుంబ్లే.. తన కుటుంబ సభ్యులతో కలసి పోలింగ్ బూత్ ముందు లైన్‌లో వేచి ఉన్న సెల్ఫీని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 
 
ఓటు వేసేందుకు మా వంతు వచ్చేవరకు వేచిచూశాం. ఇలాగే ప్రతి ఒక్కరూ దేశ పౌరులుగా మీ ఓటు హక్కు వినియోగించుకోండని కుంబ్లే తెలిపారు. కుంబ్లే చేసిన పోస్టుకు షేర్లు, లైకులు వెల్లువెత్తుతున్నాయి. పోస్టు చేయగానే దీనికి 17 వేల మంది లైక్ కొట్టగా, 200 మంది రీట్వీట్ చేశారు.

కర్ణాటకలో శనివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. 58,546 కేంద్రాల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఆరు గంటలకు ఈ పోలింగ్‌ ప్రక్రియ ముగియనుంది. ఇక బీఎన్‌ విజయ్‌ నగర్‌ మృతి చెందడంతో జయనగర్‌ పోలింగ్‌ వాయిదా పడగా.. నకిలీ ఓటర్‌ ఐడీ కార్డుల కలకలంతో ఆర్‌ఆర్‌ నగర్‌ ఎన్నిక వాయిదా పడింది.