Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇంగ్లండ్ ఆటగాళ్లకు మూడు చెరువుల నీళ్లు తాగించారు : ఆసీస్‌కు పీటర్సన్ వార్నింగ్

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (09:41 IST)

Widgets Magazine
kevin pietersen

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ వార్నింగ్ ఇచ్చాడు. భారత పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్‌కు టీమిండియా ఆటగాళ్లు చుక్కలు చూపారని, అందువల్ల కంగారులు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిక చేశాడు. 
 
ఈనెల 23వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టు సిరీస్‌ ప్రారంభంకానుంది. దీనిపై పీటర్సన్‌ స్పందిస్తూ.. ‘వీలైనంత త్వరగా స్పిన్‌ ఆడటం నేర్చుకోండి. ఒకవేళ మీరు స్పిన్‌ ఆడలేకపోతే ఈ సిరీస్‌ కోసం భారత్‌‌కు వెళ్లొద్ద’ని కంగారూ టీమ్‌కు సూచించాడు. 
 
భారత్‌‌తో ఐదు టెస్టు సిరీస్‌లో స్పిన్‌ ట్రాక్‌లపై బోల్తాపడిన ఇంగ్లండ్‌ 0-4తో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కాబట్టి స్పిన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధపడే వెళ్లాలని ఆసీస్‌కు కేపీ సూచన చేస్తున్నాడు. 
 
'భారత్‌‌కు వెళ్తే ప్రాక్టీస్‌కు కొద్ది సమయమే లభిస్తుంది. అదేదో ఇక్కడే ప్రాక్టీస్‌ చేసుకోండి. స్పిన్‌ను ఎదుర్కొనేందుకు స్లో పిచ్‌లే ఉండాల్సిన పనిలేదు. ఎలాంటి వికెట్లపైనైనా ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. స్పిన్‌ లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను ఎదుర్కోవడం ప్రాక్టీస్‌ చేస్తే సరిపోతుంది. ఫ్రంట్‌ ఫుట్‌పై ఆడడం నేర్చుకోవాల్సి ఉంటుంద'ని పీటర్సన్‌ అన్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

పరుగులన్నీ నేనే చేస్తే మిగతావాళ్లేం చేస్తారటా: ప్రెస్ మీట్ ‌లో రెచ్చిపోయిన కోహ్లీ

రాట్ కోహ్లీ, భారత క్రికెట్ జట్టు పయనం నల్లేరు మీద నడకలా సాగుతోంది. ఇంగ్లండ్‌ జట్టుతో ...

news

అతడి నుంచి నేర్చుకుంటాను, నేర్చుకుంటున్నాను, నేర్చుకుంటూనే ఉంటాను : అని అన్నదెవరు?

టీమిండియాలో కోహ్లీ, ధోనీ మధ్య సమన్వయం, సాన్నిహిత్యం ఆటగాళ్ల మధ్య అనుబంధాల సరిహద్దులనే ...

news

క్రికెటర్ సురేష్ రైనా సిక్సర్‌ బంతికి అంత పవరుందా? ఏం జరిగిందంటే...

భారత క్రికెట్ జట్టులో అలవోకగా సిక్సర్లు బాదే ఆటగాళ్లలో సురేష్ రైనా ఒకడు. ఎడమచేతివాటం ...

news

టాస్ ఓడిన ప్రతిసారీ మేమే గెలిచాం. క్రికెట్ అంటే అదే అంటున్న కోహ్లీ

టి20 సీరీస్‌లో మూడు మ్యాచ్‌లలో టాస్ కోల్పోయాం, టెస్టు సీరీస్‌లోనూ టాస్ కోల్పోయాం. వన్డే ...

Widgets Magazine